Breaking News

తమిళనాడులో ఆక్సిజన్ అందక 11మంది మృతి


తమిళనాడులో విషాద ఘటన జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులు చనిపోయినట్లు తెలుస్తోంది.. మరికొంతమంది ఇబ్బందిపడ్డారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతోనే రోగులు చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.. సిబ్బంది తీరుపై మండిపడ్డారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరాలో ఎక్కడ లోపం తలెత్తిందో తెలియాల్సి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. ఘటనపై ఆరా తీస్తున్నారు. మాత్రమే కాదు మంగళవారం కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఘటన జరిగింది. వైద్యులు మాత్రం ఆక్సిజన్ కొరతతో 12 మంది చనిపోయారని.. మిగతావారు ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారన్నారు. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక బాధితుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. తమ కళ్లేదుటే విగతజీవులుగా మారుతుంటే వైద్యులు నిస్సాహయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి చూడలేక ఢిల్లీలో ఓ యువ వైద్యుడు నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.


By May 05, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-covid-patients-died-in-chengalpattu-hospital-relatives-allege-that-lack-of-oxygen/articleshow/82397611.cms

No comments