Breaking News

RGV రేయ్ జఫ్ఫా.. కరోనా వస్తే నీ పక్కన ఏ అమ్మాయి పడుకోదురా.. శ్రీరెడ్డితో పెళ్లి చేయాలి నీకు: రాకేష్ మాస్టర్ ఫైర్


నసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకోవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కోట్లాది మంది అభిమానులు.. జనసైనికులు.. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటే.. వివాదాస్పద దర్శకుడు మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెచ్చగొట్టేలే పవన్ కళ్యాణ్‌ని అపహాస్యం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. కనిపించని పురుగు పవన్ కల్యాణ్‌ను ఇలాంటి దయనీయస్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువరానర్? అని ప్రశ్నించిన వర్మ.. వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం పవన్ ఇలా మంచాన పడడానికి కారణం కొవిడ్ కాదని, వకీల్ సాబ్ వసూళ్లు అని అంటున్నారని, అందరూ కదిలి ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి అని సెటైర్లు వేశారు. నిజానికి ‘ఫేక్’ అని తాను అనడం లేదని, వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ అంటున్నారని, వారి ఆట కట్టించేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా తాను ఛాలెంజ్ చేస్తున్నానని.. పవన్ విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలో ఉన్న ఫేక్ ఏంటో చెప్పాలని.. ర్ట్ డైరెక్షన్‌లో ఒక తప్పుందని, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ను అడిగైనా సరే ఆ తప్పేంటో చెప్పించాలని రాజమౌళిని కూడా కోరాడు వర్మ. మొత్తంగా పవన్ కళ్యాణ్ కరోనా సోకి చికిత్స తీసుకుంటే.. దానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వర్మ. అయితే వర్మ ట్వీట్లపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఓ రేంజ్‌లో స్పందిస్తూ ఏకిపారేయగా.. తాజాగా ఈ ఇష్యూపై వివాదాస్పద కొరియోగ్రాఫర్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలుస్తూ.. వర్మని బండబూతులు తిట్టారు. ‘ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఇలా స్పందిస్తారా?? ఆర్జీవీ మతి భ్రమించి.. పైశాచిక ఆనందం పొందుతూ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నీ గురించి మాట్లాడుతున్నాడా?? అతని పని అతను చూసుకుంటున్నారు. నీకేంట్రా జప్ఫా.. నువ్ ఇప్పటికే చస్తున్నావ్.. నీకు కరోనా వస్తే ఏ అమ్మాయి నీతో పడుకోదని.. నీ యబ్బ.. నువ్ నీ కూతురు గురించే నువ్ నీఛంగా మాట్లాడతావ్. అరేయ్ జటాఫటా రాజా.. నీకు శ్రీరెడ్డికి పెళ్లి చేస్తే బావుంటుందిరా.. మీ ఇద్దరి కాంబినేషన్ భలే ఉంటుంది.. తీసుకోవడం.. పోసుకోవడమే మీ పని. నువ్ ఎప్పుడైనా ఎవరికైనా గుప్పెడు అన్నం పెట్టావా? పవన్ కళ్యాణ్ ఎంత మందికి సేవ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కి కరోనా వస్తే.. ఫేక్ అంటావా?? ఎవరైనా తల్లి బిడ్డలే కదా.. శత్రుత్వాలు పెంచుకోవడం దేనికి.. ఎదుటి వ్యక్తిని మానసికంగా వేధించకూడదు. పది మంది గౌరవించే వాళ్లని గౌరవించాలి.. నీ తల్లికో చెల్లికో కరోనా వస్తే బాధపడవా?? అరేయ్ ఆర్జీవీ అసలు నువ్ మనిషివేనా? లేక పశువు పుట్టుక పుట్టావా?? నువ్ వచ్చే జన్మలో ఈగగా పుడతావ్.. నా*** లక్డికపూల్. జప్ఫానా యాలా. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు విమర్శించు.. రాజకీయంగా ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తేల్చుకో.. అంతే తప్పు ఆయనకి కరోనా వస్తే.. పవన్ కళ్యాణ్ జేబులు నింపమని అంటావా? వకీల్ సాబ్ హిట్ అయ్యింది.. దాని గురించి కూడా కామెంట్లు పెడుతున్నావ్. ఆ సినిమాకే పేరు పెడితే మరి నువ్ తీసే సినిమాలను ఏమనాలి. తొడలు చూపించడం.. చంకలు చూపించడం ఇంతేగా. నిజానికి ఆర్జీవీ అంటే నాకు చాలా ఇష్టం.. నీ డైరెక్షన్ అంటే ఇష్టం.. ఆ గౌరవాన్ని నిలుపుకో. ఇలాంటి జప్ఫా మాటలు మానెయ్. పవన్ కళ్యాణ్ పడుకుని ఉన్న ఫొటో చూపించి ఏదో గిఫ్ట్ ఇస్తా నంటున్నావ్.. అరేయ్ జప్ఫాగా.. నువ్ నీ పబ్లిసిటీ కోసం ఏం చేస్తావో అందరికీ తెలుసురా.. అప్పుడు శ్రీరెడ్డిని రెచ్చగొట్టావ్.. ఇప్పుడు ఇంకో భూరెడ్డిని తీసుకొస్తావ్.. నీ జప్ఫా పనులు ఇలాగే ఉంటాయి. మళ్లీ ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే మాత్రం నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది’ అని వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చారు రాకేష్ మాస్టర్.


By April 21, 2021 at 09:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rakesh-master-strong-counter-to-ram-gopal-varma-over-pawan-kalyan-corona-tweets/articleshow/82173751.cms

No comments