Breaking News

దర్యాప్తులో సంచలన నిజాలు... ఆక్స్‌ఫర్డ్ టీీకా శాశ్వతంగా నిలిపివేసిన డెన్మార్క్!


ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్ర దుష్ప్రభావాలు పలు దేశాల్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెన్‌కా టీకాపై డెన్మార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్‌ వినియోగాన్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కోవి‌షీల్డ్‌ వినియోగాన్ని నిలిపివేసిన తొలి ఐరోపా దేశం డెన్మార్క్ కావడం గమనార్హం. ఆక్స్‌ఫర్డ్ టీకా సురక్షితమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరోపా సమాఖ్య మెడికల్ రెగ్యులేటరీలు ఇప్పటికే ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ‘‘డెన్మార్ వ్యాక్సినేషన్ ప్రక్రియ లేకుండానే ముందుకు సాగుతుంది’’అని ఆ దేశ హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ వ్యాఖ్యానించారు. రక్తం గడ్డకడుతుందున్న ఆందోళనలతో గత నెలలోనే డెన్మార్క్‌, నార్వే, ఐస్‌లాండ్‌‌లు ఆస్ట్రాజెనికా టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టినట్టు నిర్ధారణ కావడంతో వ్యాక్సిన్ నిలిపివేస్తున్నట్లు డెన్మార్క్ తొలుత తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ తీసుకుని ఇదే సమస్యతో ఓ నర్సు చనిపోవడంతో ఆస్ట్రాజెనికా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐరోపాలోని డజనుకుపైగా దేశాలు తాత్కాలికంగా వినియోగాన్ని నిలిపివేసినా.. ఐరోపా మెడిసిన్ ఏజెన్సీ నివేదిక తర్వాత తిరిగి ప్రారంభించాయి. అయితే, డెన్మార్క్ మాత్రం దీనిపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి తాజా నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ టీకా తీసుకున్న ఇద్దరు డెన్మార్క్‌ వాసులకు రక్తం గడ్డకట్టగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 140,000 మందికి ఈ టీకాను అందజేశారు. ఆ దేశంలో మొత్తం జనాభా 5.8 మిలియన్ల కాగా.. మొత్తం 8 శాతం మందికి వ్యాక్సినేషన్ అందజేశారు. 17 శాతం మందికి తొలి డోస్ ఇచ్చారు. ఆస్ట్రాజెన్‌కాతో పాటు ఫైజర్-బయోఎన్‌టెక్ మోడెర్నా టీకాను వినియోగిస్తున్నారు.


By April 15, 2021 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/astrazeneca-vaccine-permanently-drops-by-denmark-over-suspected-side-effects/articleshow/82077229.cms

No comments