Breaking News

టీకా తీసుకున్న ఏడాదిలోపు మూడో డోస్ తప్పనిసరి.. ఫైజర్ సంచలన ప్రకటన!


కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే బ్రహ్మాస్త్రం టీకా ఒక్కటేనని, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కళ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా, మోడెర్నా, ఫైజర్, కొవాగ్జిన్ వంటివి రెండు డోస్‌ల టీకాలు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా. ఇదిలా ఉండగా, టీకా తీసుకున్న ఏడాది లోపు మూడో డోస్‌ తీసుకోవాలని ఫైజర్ సీఈఓ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఏడాదిలోపే మూడో డోస్ అవసరమని ఫైజర్ సంస్థ సీఈఓ అన్నారు. కోవిడ్-19కు వార్షిక టీకా అవసరమని పేర్కొనారు. ‘‘కోవిడ్ పరిణామ క్రమం ఏంటో మనం చూడాలి.. మనం ఎంత వరకు అలా కొనసాగించాలా చూడాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని బట్టి మూడో డోస్ అవసరం.. ఇది ఆరు నెలలు నుంచి ఏడాది మధ్య ఉంటుంది.. అక్కడ నుంచి ఏటా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.. కానీ ఈ అంశాన్ని ధ్రువీకరించాల్సి అవసరం ఉంది’’ అని తెలిపారు. వైరస్ బారినపడే అవకాశాన్ని అణచివేయడం చాలా ముఖ్యమని బౌర్లా స్పష్టం చేశారు. ఇక, కోవిడ్-19 టీకాతో వచ్చే యాంటీబాడీల వల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందో తెలియదు. ఈ విషయం గురించి పరిశోధకులు ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇక, ఫైజర్ ఇటీవలే క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విడుదల చేసిన ఫైజర్.. తమ టీకా 91 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తెలిపింది. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఆరు నెలల వరకు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో 95 శాతం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొంది. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం దీనికి సంబంధించి మరింత సమాచారం అవసరమని భావిస్తున్నారు. కరోనా వేరియంట్ల నుంచి రక్షించుకోవాలంటే బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ, జో బైడెన్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్ హెడ్ డేవిడ్ కెస్లార్ గురువారం హెచ్చరించారు. కోవిడ్ యాంటీబాడీల కాలపరిమితిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయమని తెలిపారు.


By April 16, 2021 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-vaccine-3rd-dose-likely-in-12-months-says-pfizer-ceo/articleshow/82097271.cms

No comments