Breaking News

ఇరుమడితో శబరిమలకు కేరళ గవర్నర్ మహమ్మద్ ఖాన్.. పదునెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం


మాస పూజలు, విషుం పండుగ సందర్భంగా శబరిమల అయప్పస్వామి ఆలయాన్ని రెండు రోజుల కిందట తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. తన తన చిన్న కుమారుడితో కలిసి స్వామిని దర్శించుకున్న గవర్నర్.. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కడం విశేషం. మెడలో మాలను ధరించి, ఇరుుమడితో ఐదు కిలోమీటర్లు కాలినడకన కొండ ఎక్కారు. అనంతరం 18 మెట్ల గుండా సన్నిధానానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద గవర్నర్‌కు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాస్, ఇతర సభ్యులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాత్రికి శబరిమలలోనే ఉన్న ఆయన సోమవారం ఉదయం మాలికాపురత్తమ్మ ఆలయం వద్ద ఒ ఎర్ర చందనం మొక్కను నాటినట్టు దేవస్థానం బోర్డు తెలిపింది. అనంతరం పుణ్యం పుంగావనమ్ ప్రాజెక్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అరిఫ్ ఖాన్ శబరిమల వెళ్లిన ఫొటోలను కేరళ గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ రాజ్ భవన్ అధికారులు ట్వీట్ చేశారు. నెలవారీ పూజలు, విషుం పండుగ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఏప్రిల్ 18 వరకు తెరిచే ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటానే అనుమతిస్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


By April 12, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-governor-mohammed-khan-visit-sabarimala-temple-with-irumudi/articleshow/82026025.cms

No comments