Breaking News

కొవాగ్జిన్ ధర భారీగా తగ్గించిన భారత్ బయోటెక్.. రాష్ట్రాలకు తగ్గనున్న భారం


కోవిడ్ వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్రం విజ్ఞ‌ప్తిపై తయారీ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ధరను సీరమ్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ ఇండియా తగ్గించిన మర్నాడే.. కూడా అుదే బాటలో పయనించింది. ధ‌ర‌ను త‌గ్గించిన‌ట్లు ఆ సంస్థ గురువారం సాయంత్రం వెల్ల‌డించింది. ఒక్కో డోస్ రాష్ట్రాలకు రూ. 400కే స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు భారత్ బయోటెక్ తెలిపింది. గ‌తంలో ఒక్కో డోసును రూ. 600గా నిర్ధారించిన భార‌త్ బ‌యోటెక్.. దాన్ని రూ. 200 త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కొవిషీల్డ్ టీకా ధ‌ర‌ను రాష్ట్రాలకు రూ. 400గా నిర్ణయించిన సీరమ్ సంస్థ దానిని రూ. 300కు త‌గ్గించింది. గతవారం భార‌త్ బ‌యోటెక్ టీకా డోస్‌ల ధరలను వెల్లడించిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్ ఒక్కో డోస్ కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600లకు, ప్రైవేటు హాస్పిటల్స్‌ రూ.1200లుగా నిర్ణయించినట్టు తెలిపింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15-20 డాలర్ల (రూ.1,100-రూ. 1,500) మధ్య ఉంటుందని పేర్కొంది. తాము ఉత్పత్తి చేసే మొత్తం టీకాల్లో సగం కంటే ఎక్కువ కేంద్రానికి రిజర్వ్‌ చేస్తామని, వాటిని ప్రస్తుతం ఉన్నట్టుగా రూ.150కే అందజేస్తామని స్పష్టం చేసింది. కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ధరలు నిర్ణయించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఒకే దేశంలో వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఈ క్ర‌మంలోనే ధ‌ర‌ను కొంత మేర త‌గ్గించిన‌ట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ను అతి తక్కువ సమయంలో తయారు చేయగలిగిన ఫార్మా కంపెనీలు ఉన్నా కూడా మనదేశంలోనే వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఇండియా కంటే తక్కువకే లభ్యమవుతోంది. ఇండియాలో కోవిషీల్డ్ ధర సుమారుగా 8 డాలర్లు(రూ.600). సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికాలో 5.25 డాలర్లు. అమెరికాలో కేవలం నాలుగు డాలర్లు. ఇండియన్ కరెన్సీలో రూ.300 మాత్రమే. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోనూ కోవిషీల్డ్ నాలుగు డాలర్లకే దొరుకుతోంది. బ్రిటన్‌లో అయితే 3 డాలర్లు(సుమారు రూ.240)లకే కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుకి చెల్లిస్తోంది.


By April 30, 2021 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bharat-biotech-reduces-their-covid-vaccine-covaxin-price-for-states/articleshow/82320091.cms

No comments