Breaking News

ఆ స్పాట్‌లో రష్మిక మందనకు విజయ్ దేవరకొండ ప్రపోజ్.. సీక్రెట్ మీట్‌పై క్లారిటీ! ఇదీ విషయం


యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ- రష్మిక జోడీకి ఉన్న క్రేజే వేరు. ఇండస్ట్రీకి వచ్చి రావడమే వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ తమకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకలోకం ఫిదా అయింది. 'గీత గోవిందం' సినిమాలో తమ లిప్ లాకుల్లో ఉన్న మజా ఎలా ఉంటుందనేది చూపించి ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీలో అదే లెవల్ కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు. సినిమాల సంగతి అటుంచితే బయట కూడా ఈ జోడీ మంచి ఫ్రెండ్ షిప్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. వీలు కుదిరితే కలవడం, ఎప్పుడూ ఒకరితో ఒకరు టచ్‌లో ఉండటం వీరిద్దరి ఫ్రెండ్ షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేసింది. దీంతో ఆ మధ్య విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ గురించిన కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీళ్ళ మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక రీసెంట్‌గా మరోసారి ముంబైలోని ఓ రెస్టారెంట్ స్పాట్ వద్ద ఈ ఇద్దరూ కెమెరాకు చిక్కడం, పైగా రష్మిక చేతిలో ఫ్లవర్ బొకే ఉండటంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియోతో దీని గురించిన క్లారిటీ వచ్చేసింది. విజయ్ దేవరకొండ- రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా వాళ్ళతో ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌‌కి సంబంధించి చిన్న వీడియో క్లిప్ బయటకొచ్చింది. ఇందులో రష్మికకు ఓ గిఫ్ట్ ఇస్తూ మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయడం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలా మొత్తానికి ముంబైలో విజయ్ దేవరకొండ- రష్మికల సీక్రెట్ మీట్‌పై ఓ క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు.


By April 21, 2021 at 07:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/viral-video-vijay-deverakonda-love-propose-to-rashmika-mandanna/articleshow/82172476.cms

No comments