Breaking News

కరోనాతో కన్నుమూసిన పీఠాధిపతి.. కుంభమేళా నుంచి వైదొలగిన నిర్వానీ అఖాడా


కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నా.. హరిద్వార్ కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుంభమేళాకు వచ్చినవారిలో చాలా మంది కరోనా బారిపడుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి 14 మధ్య 68 మంది ప్రముఖ స్వామీజీలకు వైరస్ నిర్ధారణ అయినట్టు ఉత్తరాఖండ్ ఆరోగ్య విభాగం సీనియర్ అధికారులు ధ్రువీకరించారు. ఇక, మధ్యప్రదేశ్‌లోని నిర్వాణీ అఖాడా స్వామీజీ మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ (65) కరోనాతో కన్నుమూశారు. కుంభమేళా వద్ద ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న ఆయన కన్నుమూసినట్టు అధికారులు గురువారం తెలిపారు. 13 ముఖ్యమైన అఖాడాల్లో నిర్వానీ కూడా ఒకటి. సాధువుల పెద్ద సంఖ్యలో కరోనా బారినపడటంతో నిరంజనీ అఖాడా సంచలన నిర్ణయం తీసుకుంది. కుంభమేళా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. నాగా సాధువులు పెద్ద సంఖ్యలో కలిగి ఉన్న నిరంజనీ అఖండా.. జునా అఖాడా తర్వాత అత్యంత శక్తివంతమైంది. కుంభమేళా అధికార యంత్రాంగం ప్రకారం.. గురువారం 14,915 మంది పరీక్షలు నిర్వహించగా.. 332 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, మేళాకు హాజరై కోవిడ్-19తో చనిపోయిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. బుధవారం 13,415 మంది పరీక్షలు నిర్వహించగా 119 కేసులు బయటపడ్డాయి. ఏప్రిల్ 14 నుంచి మొత్తం 79,301 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 745 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. నిరంజని అఖాడా సెక్రెటరీ మహంత రవీంద్ర పూరీ మాట్లాడుతూ.. హరిద్వార్ క్యాంపులోని చాలా మంది సాధువులు, తమ అనుచరులకు కోవిడ్ తరహా లక్షణాలు బయటపడటంతో ఏప్రిల్ 17న కుంభమేళాను ముగించాలని నిర్ణయించామని తెలిపారు. ‘‘మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ స్వామి ఏప్రిల్ 12న ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు.. ఆయన ఏప్రిల్ 13న కన్నుమూసినట్టు ఆరోగ్య శాఖకు సమాచారం వచ్చింది.. ఆయనకు కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఉందని, డయాలసిస్ జరుగుతోంది’’ అని ఉత్తరాఖండ్ వైద్య విభాగం డైరెక్టర్ జనరల్ త్రిపాఠీ బహుగుణ తెలిపారు. కంఖాల్ వద్ద క్యాంపులో కపిల్ దేవ్ దాస్ స్వామి బసచేయగా... 10వేల మందికిపైగా సాధువులు, ఆయన అనుచరులు ఆ ప్రాంతంలో ఉన్నారు. శుక్రవారం ఆ ప్రాంతాన్ని ఆరోగ్య శాఖ విభాగం పరిశీలించనుందని, శానిటైజేషన్ చేసి, అక్కడ ఉన్నవారి అందని శాంపిల్స్‌ను సేకరించనుందని సీఎం అధికారి తెలిపారు.


By April 16, 2021 at 01:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/2nd-largest-akhada-exits-kumbh-mela-after-nirwani-head-death-due-to-covid/articleshow/82098880.cms

No comments