Breaking News

జనాన్ని ఫూల్స్ చేసిన వైల్డ్ డాగ్.. చెప్పిందొకటి చేసిందొకటి.. ఇదీ అసలు సంగతి!


అక్కినేని నాగార్జున లీడ్ రోల్‌లో రూపొందిన కొత్త సినిమా ''. యాక్షన్ థ్రిల్లర్‌ కథాంశంగా నేడే (ఏప్రిల్ 2) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అయితే విడుదలకు ముందు రోజు ఈ 'వైల్డ్ డాగ్' జనాన్ని ఫూల్స్ చేసేసింది. ఏప్రిల్ నెల 1వ తేదీ కదా! అందుకే ఫూల్స్ చేశారేమో గానీ ఈ ఇష్యూ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటారా? ఈ వార్తపై పూర్తిగా ఓ లుక్కేయండి మీరే అర్థమవుతుంది. నేటిరోజుల్లో తమ తమ సినిమాలను ఎలాగైనా జనం నోళ్ళలో నానేలా చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ మేరకు ప్రమోషన్స్ పరంగా వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'వైల్డ్ డాగ్' నిర్మాణ సంస్థ జనాన్ని ఫూల్స్ చేస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంది. సాధారణంగా ఏ నిర్మాణ సంస్థ అయినా తమ సినిమాను థియేటర్స్ లోనే చూడాలని, ఎక్కడైనా పైరసీ కనిపిస్తే తమకు ఫిర్యాదు చేయండని అంటుండటం ఇప్పటిదాకా చూశాం. కానీ 'వైల్డ్ డాగ్' నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మాత్రం అందుకు భిన్నంగా తమ సినిమా 'వైల్డ్ డాగ్' ఫుల్ మూవీ మొత్తాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని పేర్కొంటూ సదరు లింక్ కూడా పోస్ట్ చేసేసింది. కాకపోతే ఇది చూడొద్దని, థియేటర్స్‌లోనే చూడండని ట్వీట్ చేశారు నిర్మాతలు. మరి రిలీజ్‌కి ముందే యూట్యూబ్‌లో మొత్తం సినిమా వచ్చిందంటే జనం ఊరుకుంటారా? చెప్పండి. వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి సినిమా చూసే ప్రయత్నం చేశారు. అయితే అలా లింక్ క్లిక్ చేసిన వాళ్లందరికీ ఊహించని షాక్ తగిలింది. లింక్‌ ఓపెన్‌ అయిన వెంటనే సినిమాకు బదులుగా , ప్రత్యక్షమై 'పైరసీ ఆపండి. వైల్డ్‌డాగ్‌ థియేటర్‌లోనే చూడండి' అని చెబుతుండటం కనిపించింది. దాదాపు ఆ వీడియో నిడివి 2 గంటలకు పైగా ఉండగా మొత్తం కూడా ఇదే సందేశంతో నింపేశారు. దీంతో ఇది ప్రమోషన్ ట్రిక్ అని అర్థం చేసుకున్న నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ఏప్రిల్ 1న జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేసి తమ సినిమాకు ప్రమోషన్ చేసుకోవాలని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయిందని చెప్పుకోవచ్చు.


By April 02, 2021 at 12:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/wild-dog-producers-promotion-technique-full-movie-piracy-video/articleshow/81869141.cms

No comments