Breaking News

స్త్రీ, పురుషులకు ఖురాన్‌లో సమాన హక్కులు.. ముస్లిం విడాకుల కేసులో హైకోర్టు సంచలన తీర్పు


ముస్లిం మహిళల విడాకుల కేసులో సంచలన తీర్పును ఏప్రిల్ 9న వెలువరించింది. విడాకుల విషయంలో ముస్లిం మహిళలు అదనపు న్యాయ పద్ధతులను ఆశ్రయించకుండా నిషేధిస్తూ 1972లో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కుటుంబ న్యాయస్థానాలలో వేర్వేరుగా తలెత్తిన అంశాలకు సంబంధించిన కొన్ని కేసులను ఉమ్మడిగా విచారించిన ఈ తీర్పును వెల్లడించింది. ముస్లింల విడాకుల విషయంలో స్త్రీ, పురుషులకు ఒకే విధమైన హక్కులను పవిత్ర ఖురాన్ కల్పించిందన్న ధర్మాసనం.. ఈ విషయంలో మహిళలు డైలామాలో ఉన్నారని పేర్కొంది. ‘‘కేసీ మొయిన్ వర్సస్ నసీఫా, ఇతరుల కేసు’’లో సింగిల్ బెంచ్ తీర్పు న్యాయపరంగా విడాకుల కోరే హక్కును నిరాకరించడంతో కేరళలోని ముస్లిం మహిళలు సందిగ్ధతలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ముస్లిం వివాహా రద్దు చట్టం 1939 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా మహిళలు విడాకులు కోరవచ్చని జస్టిస్ ఏ మొహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ దియాస్‌ల ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఇస్లామిక్ చట్టం గుర్తించిన ప్రకారం, షరియాత్ చట్టం కింద రక్షణ పొందుతున్న నాలుగు ప్రధాన రూపాలైన తలాక్-ఎ-తఫ్విజ్, ఖులా, ముబారాఅత్, ఫాస్క్ వివాహాలను ధర్మాసనం విశ్లేషించింది. ‘‘షరియాత్ చట్టం, ముస్లిం వివాహాల రద్దు చట్టం ముస్లిం మహిళలు తమ వివాహాన్ని రద్దు చేసుకుని అవకాశం కల్పిస్తుందని మేము భావిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘షరియాత్ చట్టంలోని సెక్షన్ 2 లో సూచించిన అన్ని ఇతర రకాల అదనపు న్యాయ విధానాలు ముస్లిం మహిళలకు అందుబాటులో ఉన్నాయి... అందువల్ల, కేసీ మొయిన్ కేసులో (సుప్రా) అనుసరించిన చట్టం సరైంంది కాదని మేము భావిస్తున్నాం’’అని స్పష్టం చేసింది. తలాక్-ఎ-తఫ్విజ్ ప్రకారం.. తన భర్త నుంచి ముస్లిం మహిళ విడాకులకు అనుమతిస్తుంది.. ఖులా ద్వారా భర్త ఏకపక్షంగా విడాకులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ముబారాత్ పరస్పర అంగీకారం ద్వారా విడాకులు తీసుకోడానికి, ఖాజీ పద్దతి మూడవ వ్యక్తి జోక్యంతో వివాహాం రద్దు చేయడానికి అనుమతిస్తుంది.


By April 15, 2021 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-high-court-says-muslim-women-have-right-to-invoke-extra-judicial-divorce/articleshow/82079674.cms

No comments