Breaking News

Amazon బంపరాఫర్.. ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. వారికి మాత్రమే.!


ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. రోజురోజుకీ ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో తీపికబురు అందించింది. ఫ్రీగా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును కంపెనీయే భరిస్తుందని తెలిపింది. కంపెనీ ఉద్యోగులు, ఆపరేషన్ భాగస్వాములు, డెలివరీ పార్టనర్స్, వారి కుటుంబ సభ్యుల కరోనా వ్యాక్సిన్ ఖర్చును కంపెనీయే చెల్లిస్తుందని సంస్థ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. అందులో భాగంగా కంపెనీ ఉద్యోగులతో పాటు అనుబంధ సంస్థల సిబ్బంది సుమారు 10 లక్షల మందికి వ్యాక్సిన్ అందించనున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. అమెజాన్‌లో సెల్లర్స్(అమ్మకందారులకు) కూడా వ్యాక్సిన్ ఖర్చును భరిస్తుంది. తదనుగుణంగా ఇప్పటికే వ్యాక్సినేషన్‌కి అర్హులైన వారి జాబితాను తయారు చేశామని.. విడతలవారీగా వారికి వ్యాక్సిన్ వేయించనున్నట్లు పేర్కొంది. కోవిడ్ బారిన పడిన ఉద్యోగులు, సిబ్బంది కోసం గతంలో అమెజాన్ ఇండియా అమెజాన్ రిలీఫ్ ఫండ్‌(ఏఆర్‌ఎఫ్)ని కూడా ఏర్పాటు చేసింది. 25 మిలియన్ల యూఎస్ డాలర్లతో ప్యాకేజీ ప్రకటించింది. కోవిడ్ బారిన పడిన సిబ్బంది కోసం ఈ ఫండ్‌ను వినియోగిస్తోంది. Also Read:


By April 14, 2021 at 02:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amazon-india-offers-covid-19-vaccine-at-free-of-cost-for-company-employees-sellers-others/articleshow/82064255.cms

No comments