Breaking News

Jathi Ratnalu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'జాతిరత్నాలు' టీమ్.. ఫుల్ జోష్‌లో నవీన్, ఫరియా


కరోనాతో మూతపడ్డ థియేటర్స్ దుమ్ముదులుపుతూ సత్తా చాటుతున్నారు ''. మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఈ నేపథ్యంలో ఫుల్ ఖుషీ అవుతున్న చిత్రయూనిట్ నేటి (గురువారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామి వారి ఆశీర్వాదం పొందారు. కాలిన‌డ‌క‌న తిరుమల కొండ‌క్కిన జాతిరత్నాలు టీమ్ ఉదయాన్నే వీఐపీ ద‌ర్శ‌న స‌మయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హీరో , హీరోయిన్ చిత్ర విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. న‌వీన్ పోలిశెట్టి కుర్తా, దోతి ధ‌రించి సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన లుక్‌లో కనిపించగా, ఫరియా అబ్దుల్లా నాచురల్ లుక్‌లో కనిపించింది. తిరుమలేశుని దర్శనం తర్వాత జాతిరత్నాలు టీమ్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం సినీ వర్గాలను ఆనందపరిచింది. తనదైన స్టైల్‌లో కథను మలిచిన అనుదీప్ కేవీ దర్శకత్వ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. జాతిరత్నాలుగా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కడుపుబ్బా నవ్వుస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తుండటం గమనార్హం.


By March 18, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jathi-ratnalu-team-visited-tirumala-temple/articleshow/81563622.cms

No comments