Breaking News

విడుద‌లకి ముస్తాబ‌వుతున్న ‘బ‌జార్ రౌడి’.. వేసవిలో వస్తోన్న బర్నింగ్ స్టార్


‘హృద‌య‌కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’, ‘సింగం 123’ లాంటి విభిన్నమైన చిత్రాల‌తో త‌న‌కంటూ ఒక ప్రత్యేఖ‌మైన ఇమేజ్‌ని సంపాదించిన హీరో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఆయన హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం ‘బ‌జార్ రౌడి’. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, మోష‌న్ పోస్టర్‌ ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటుంది. కె.ఎస్.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. డి.వ‌సంత నాగేశ్వరావు ద‌ర్శక‌త్వం వహించారు. సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న మ‌హేశ్వరి వ‌ద్ది హీరోయిన్‌గా నటించారు. అతి త్వర‌లో టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమా గురించి ద‌ర్శకుడు డి.వ‌సంత నాగేశ్వరావు మాట్లాడుతూ.. ‘‘సంపూర్ణేష్ బాబు హీరోగా చేస్తున్న ‘బ‌జార్ రౌడి’ చిత్రం అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. బ‌డ్జెట్ విష‌యంలో లిమిటేష‌న్ పెట్టకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శేఖ‌ర్ త‌న అనుభ‌వంతో ఎక్కడ ఖ‌ర్చుపెడితే స్క్రీన్ మీద అందంగా క‌న‌బ‌డుతుందో అక్కడే ఖర్చుపెడుతూ చ‌క్కటి ప్లానింగ్‌తో మా అంద‌రికీ స‌పోర్ట్‌గా నిలిచారు. మాకు పలానా లోకేష‌న్ కావాలి, పలానా ఆర్టిస్ట్ కావాలి అని అడిగితే ఏమాత్రం ఆలోచించ‌కుండా శేఖ‌ర్ అందించారు కాబ‌ట్టే ఈ చిత్రం ఇంత భారీ తారాగాణంతో తెర‌కెక్కింది. అలాగే మా హీరోయిన్ మ‌హేశ్వరి వ‌ద్ది త‌న పాత్రలో ఇమిడిపోయారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో షాయాజి షిండే, పృథ్వి, నాగినీడు, ష‌ఫి, జీవ‌, స‌మీర్‌, మణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి నటించారు. ఇటీవల విడుద‌ల చేసిన మోష‌న్ పోస్టర్‌కి వ‌చ్చిన స్పందనతో మా బిజినెస్ కూడా ఊపందుకుంది. అలాగే, ఈ చిత్రం టీజ‌ర్‌ని అతి త్వర‌లో విడుద‌ల చేస్తాం. సాయి కార్తీక్ అందించిన ఆడియోని గ్రాండ్‌గా విడుద‌ల చేస్తాం. ఈ స‌మ్మర్‌లో మా ‘బజార్ రౌడి’ విడుదల‌కి ముస్తాబవుతుంది’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి మరుధూరి రాజా మాటలు రాశారు. గౌతం రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాషువా ఫైట్ మాస్టర్.


By March 07, 2021 at 04:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sampoornesh-babu-bazaar-rowdy-movie-will-be-hit-screens-in-this-summer/articleshow/81376769.cms

No comments