Breaking News

ఆ భారీ నౌక కదలింది.. కానీ, అందులో భారతీయ సిబ్బంది కఠిన చర్యలు!


మార్చి 23 నుంచి సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌక '' ఆరు రోజుల ముమ్మర ప్రయత్నాల అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. నౌక ముందు భాగం ఇసుక, బంకమట్టిలో కూరుకుపోగా.. డ్రెడ్జర్లతో తవ్వి, టగ్ పడవలతో లాగడంతో ప్రయత్నాలు ఫలించాయి. అయితే, నౌకలోని సిబ్బంది విషయంలో అథారిటీ ఎల వ్యవహరిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయంగా మారింది. ఇందులోని 25 మంది భారతీయులే ఉన్నారు. క్రిమినల్ అభియోగాలు సహా సిబ్బంది ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యల గురించి భారత్, సముద్రయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షిప్పింగ్ పరిశ్రమ వర్గాల ప్రకారం.. నౌక కెప్టెన్, కొంత మంది క్రూ సిబ్బందిపై కొద్ది రోజులు ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉంది. ఘటనపై విచారణ పూర్తయ్యేవరకూ వారిని హౌస్ అరెస్ట్ చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవర్ గివెన్ నిర్వహాణ సంస్థ మాత్రం.. సిబ్బంది అనుసరించాల్సిన చట్టపరమైన విధానాల గురించి ఎటువంటి స్పష్టతనివ్వలేదు. ‘నౌక సిబ్బంది బలిపశువులను చేసే ప్రమాదం ఉందనేది స్పష్టమవుతోంది’ అని నౌకాయాణ పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.‘‘తొలుత ఈ భారీ నౌక ఎలా అడ్డం తిరిగిందో నిర్ధారించాలి. షిప్ వాయేజ్ డేటా రికార్డర్‌ను పరిశీలించడం ద్వారా వాస్తవాలను తెలుసుకోవచ్చు.. ప్రమాదానికి కారణాలపై ఒక అవగాహనకు రావచ్చు’ అని నేషనల్ షిప్పింగ్ బోర్డ్ (ఎన్‌ఎస్బీ) సభ్యుడు కెప్టెన్ సంజయ్ ప్రషార్ అన్నారు. మార్చి 23న సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డం తిరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొత్తం 450 వరకు నౌకలు నిలిచిపోయాయి. వీటిలో చాలా వరకు మేకలు, క్రూడాయిల్, ఫర్నిచర్, దుస్తులతో కూడిన నౌకలే అధికంగా ఉన్నాయి. బెరహార్డ్ షెల్టే షిప్ మేనేజ్‌మెంట్ (బీఎస్ఎస్ఎం) మాత్రం 25 మంది భారతీయుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, వారంతా క్షేమంగా ఉన్నారని, నౌక సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపింది. కెప్టెన్, సిబ్బందిపై ప్రశంసలు కురిపించింది. భారతీయ సిబ్బందిపై ప్రశంసలు కురిపించినప్పటికీ చట్టపరమైన చర్యలు అనివార్యంగా కనిపిస్తోంది. మరోవైపు, ముంబయిలోని నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫేరర్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌యూఎస్ఐ) నౌకలోని భారతీయులకు సంఘీభావం ప్రకటించింది. ఎవర్ గివెన్‌లోని భారతీయ సిబ్బందిని సంప్రదించామని, వారికి అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.


By March 30, 2021 at 12:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ever-given-suez-blockage-ends-but-indian-crew-may-face-legal-charges/articleshow/81755613.cms

No comments