Breaking News

సుప్రీం కోర్టు తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ.. న్యాయశాఖకు సీజే బోబ్డే లేఖ


తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా కానున్నారు. 48వ సీజేఐగా ఆయనను ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ బోబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే పదవీకాలం పూర్తికానుంది. దీంతో ఎన్వీ రమణ పేరును బోబ్డే సిఫార్సు చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్‌కే చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంటుంది. బోబ్డే తర్వాత ఎన్వీ రమణ సీనియర్‌గా ఉన్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ఎన్వీ రమణ తెలుగువారు.. 1957 ఆగ‌స్ట్ 27న కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి జస్టిస్ ర‌మ‌ణ సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కుముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు. 2000 జూన్ 27 నుంచి 2013 సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు.


By March 24, 2021 at 11:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cji-s-a-bobde-recommends-justice-n-v-ramana-as-his-successor/articleshow/81664440.cms

No comments