Breaking News

ఇండో-పసిఫిక్‌లో మరింత దూకుడు ప్రదర్శిస్తోన్న చైనా.. పెంటగాన్ సంచలన ఆరోపణలు


ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మరింత దూకుడుగా ముందుకెళ్తోందని అమెరికా రక్షణ విభాగం అధికార యంత్రాంగం వెల్లడించింది. పెరుగుతున్న తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోన్న డ్రాగన్.. రిస్క్ తీసుకోడానికి కూడా వెనుకాడటం లేదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ సెక్రెటరీ డాక్టర్ కథ్లీన్ హిక్స్ అన్నారు. నేషనల్ వార్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడిన ఆయన.. ఒక్క 2020లోనే ఆస్ట్రేలియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ సహా పొరుగుదేశాలతో అనేక అంశాల్లో వివాదాలను రాజేసిందని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌తో ఆయుధ యుద్ధానికి సిద్ధం కావడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిందన్నారు. అలాగే, హాంకాంగ్ విషయంలో చేసిన చట్టం కూడా ఘర్షణ వాతావరణానికి కారణమయ్యిందని వ్యాఖ్యానించారు. చైనా చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పుగా పరిణమించాయని హిక్స్ అభిప్రాయపడ్డారు. భద్రత, శ్రేయస్సు, అమెరికా మిత్రదేశాల పట్ల చైనా వైఖరిని హిక్స్ ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల జాతీయ భద్రతా వ్యూహాత్మక మార్గదర్శకాలను విడుదల చేశారు.. ఇది చైనా పెరుగుతున్న అగ్రరాజ్యానికి ఉన్న దృక్పథాన్ని తెలియజేస్తుంది. తన ఆర్థిక, దౌత్య, సైనిక, సాంకేతిక శక్తిని మిళితం చేయగల తమ ఏకైక పోటీదారు చైనా అని తాత్కాలిక మార్గదర్శకత్వం పేర్కొంది. అమెరికా ప్రజల ప్రయోజనాలు, మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రమాణాలతో కూడిన మన జీవన విధానం భవిష్యత్తు అమెరికా కోసం పోటీపడాలని అన్నారు. అమెరికా దౌత్య, ఆర్థిక, ఇతర అంశాలకు మద్దతుగా అమెరికా సైన్యం పనిచేయాలని డాక్టర్ హిక్స్ చెప్పారు. కానీ, చైనా దూకుడును అడ్డుకోవడం కూడా అవసరమని స్పష్టం చేశారు.


By March 20, 2021 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-has-adopted-more-aggressive-approach-to-indo-pacific-pentagon/articleshow/81600244.cms

No comments