Breaking News

కర్ణాటక: ఎమ్మెల్యే రాసలీలల సీడీ కేసులో ట్విస్ట్.. యువతి సంచలన ఆరోపణ


కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల సీడీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వ్యవహారం వెలుగుచూసిన తర్వాత కనిపించకుండా పోయిన యువతి ఎట్టకేలకు అజ్ఞాతం వీడింది. శనివారం రాత్రి అనూహ్యంగా ప్రత్యక్షమైన ఆమె.. తనకు రక్షణ కల్పించాలంటూ హోం మంత్రి బసవరాజబొమ్మైను ఓ వీడియో సందేశం ద్వారా అభ్యర్ధించింది. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఉద్యోగం కోసమే జార్ఖిహొళితో కలిశానన్నారు. పరువు, మర్యాద పూర్తిగా కోల్పోయి, ప్రతిచోటా తన పట్ల చులకన భావం ఏర్పడిందని వాపోయింది. ఇప్పటికే తాను పలుసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని, తల్లిదండ్రుల పరువు మంటగలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనతోపాటు వాళ్లు కూడా రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారని పేర్కొంది. తనకు ఏ రాజకీయ నేత మద్దతు లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ వీడియో ఎవరు తీశారు? బయటికి ఎలా వచ్చింది? అనేది కూడా తనకు తెలియదని ఉద్ఘాటించింది. కాగా, బాధిత యువతి వీడియో సందేశంపై జార్జిహొళి స్పందించారు. సీడీ వెలుగులోకి వచ్చిన 12 రోజుల తర్వాత యువతి బయటికి వచ్చిందని, ఇది ఓ కుట్రలో భాగమని ఆరోపించారు. అంతేకాదు, ఆమె కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారి వారు చెప్పినట్టల్లా ఆడుతోందని మండిపడ్డారు. ఇన్నాళ్లూ కనిపించని ఆమె ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చిందని మాజీ మంత్రి నిలదీశారు. మార్చి 2న రాసలీలల సీడీ బయటకు వచ్చినప్పటి నుంచి యువతి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్.. సీడీ బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లిందో ప్రాథమికంగా గుర్తించింది. మార్చిన 2 రాత్రి తన ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి నాలుగు రోజుల పాటు గోవా ఉండి, అనంతరం బెంగళూరుకు తిరిగివచ్చి నగర శివారులో మకాం వేసినట్టు తేల్చింది. అయితే, అనూహ్యంగా ఆమె వీడియో రూపంలో ఆమె ప్రత్యక్షమయ్యారు.


By March 14, 2021 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-woman-in-ramesh-jarkiholi-cd-scandal-seeks-state-protection/articleshow/81490526.cms

No comments