Breaking News

తాగి షూటింగ్‌కి, బాలయ్య తిట్టినా వినలేదు, ఆ దర్శకుడు పరమ నీచుడు, దుర్మార్గుడు: అంబికా కృష్ణ షాకింగ్ కామెంట్స్


నందమూరి బాలకృష్ణ కెరియర్‌లో మోస్ట్ డిజాస్టర్ చిత్రాల లిస్ట్ ఒకటి. ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని అప్పట్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు రవికుమార్ చౌదరి అని అతనో పెద్ద నీచుడు, దుర్మార్గుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత అంబికా కృష్ణ. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి బాలక్రిష్ణతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ వీరభద్ర సినిమా గురించి మాట్లాడారు అంబికా కృష్ణ. ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరిపై సంచలన కామెంట్స్ చేశారు. ‘బాలయ్య నటించిన వీరభద్ర సినిమా అంత ఘోరంగా ఫెయిల్ కావడానికి కారణం దర్శకుడు ఏఎస్ రవికుమార్. ముమ్మాటికీ అతని ఫెయిల్యూర్ వల్ల భారీ డిజాస్టర్ వచ్చింది. పరమ దుర్మార్గపు నీచుడు వాడు. నాకు ఎలాంటి మొహమాటం లేదు.. వాడో పెద్ద నీచుడు.. ఈ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. వాడివల్లే సినిమా పాడైపోయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి వాడి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి.. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టించేసి ఒక్కటి కూడా సరిగా చేయలేదు. చెప్పిన కథ ఒకటి చేసిన స్క్రిప్ట్ ఒకటి.. అనుకున్న బడ్జెట్ ఒకటి.. ఖర్చు పెట్టించింది మరోటి. ఒళ్లు పొగరుతో అహంకారంతో సినిమా తీసి మొత్తం నాశనం చేశాడు. బాలయ్య గారి కాల్ షీట్లు దొరికి.. సినిమా వచ్చిందంటే మనం ఎంత జాగ్రత్తగా తీయాలి. వాడు మాత్రం తాగి షూటింగ్‌కి వచ్చేవాడు. బాలయ్య గారు కూడా వీడి మీద కేకలు వేశారు, తిట్టారు. అయినా మారలేదు. కానీ సినిమా విషయంలో బాలయ్య చాలా నిబద్ధతతో ఉంటారు. దర్శకుడు ఎలాంటి వాడైనా సరే.. ఆయన చెప్పిందే చేస్తారు. వీరభద్ర సినిమా పోవడానికి కారణం బాలయ్య కాదు.. దర్శకుడే .. వాడి నీఛుడు వాడివల్లే పోయింది సినిమా. నేను కూడా చాలా నష్టపోయా. పాపం బాలయ్య గారూ తరువాత కూడా అన్నారు.. మనం మళ్లీ చేద్దాం అని. అది ఆయన మంచితనం. షూటింగ్ సమయంలో చాలాసార్లు చెప్పిచూశాం.. చాలా గొడవలు కూడా అయ్యాయి. బూతులు కూడా వచ్చాయి’ అంటూ దర్శకుడు ఏఎస్ రవికుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు అంబికా కృష్ణ.


By March 31, 2021 at 11:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/producer-ambika-krishna-sensational-comments-on-director-as-ravi-kumar-chowdary-over-veerabhadra-movie/articleshow/81773552.cms

No comments