Breaking News

కర్ణాటక రాసలీలల సీడీలో మరో ట్విస్ట్... మూడో వీడియో వదిలిన యువతి!


కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వ్యవహారం శుక్రవారం మరో మలుపు తిరిగింది. రమేశ్‌ జార్కిహొళిపై కబ్బన్‌పార్కు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాసలీలల సీడీలో ఉన్న యువతి తాజాగా మూడో వీడియోను విడుదల చేసింది. తానుఅజ్ఞాతంలో ఉన్నానని, లాయర్ ద్వారా కమిషనర్‌కు ఫిర్యాదు లేఖను పంపుతున్నానని ఆమె వీడియోలో పేర్కొన్నారు. యువతి తరఫున లాయర్ కేఎన్‌ జగదీశ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌ కమల్‌పంత్‌కు ఫిర్యాదు లేఖ అందించారు. పోలీసులకు అందజేసిన రెండు పేజీల ఫిర్యాదు లేఖను కన్నడలో రాశారు. తాను, తన కుటుంబం బెదిరింపులను ఎదుర్కొంటున్నామని, చంపుతామని బెదిరిస్తున్నారని యువతి ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రమేశ్‌ జార్కిహొళిపై లైంగిక వేధింపులు, మోసానికి పాల్పడటం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాసలీలల సీడీ కేసులో దాఖలైన రెండో ఎఫ్ఐఆర్ ఇది. మార్చి 13న ఈ వ్యవహారంలో తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ రమేశ్ జార్ఖిహోళి ఫిర్ాయదు చేసిన విషయం తెలిసిందే. ‘ఓ డాక్యుమెంటరీ కోసం రమేశ్ జార్ఖిహోళిని కలిశాను.. ఆ సమయంలో తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, సంబంధిత వ్యక్తితో మాట్లాడారు.. ఉద్యోగం కావాలంటే అన్ని విధాలుగా సహకరించాలని కోరడంతో నేను నిజమని నమ్మాను.. ఒకసారి ఢిల్లీలోని కర్ణాటక భవన్‌ నుంచి నాకు వీడియో కాల్ చేసి.. నగ్నంగా మాట్లాడాలని కోరాడు.. ఆయన కూడా అలాగే చేస్తానన్నాడు.. ఇది జరిగిన తర్వాత ఒక రోజు ఉద్యోగం గురించి మాట్లాడాలని అపార్ట్‌మెంట్‌కు రావాలని చెప్పారు.. అక్కడకు వెళ్లిన తర్వాత నన్ను అభ్యంతరకరంగా తాకుతూ.. లైంగిక దాడికి ప్రయత్నించాడు. నేను ఒప్పుకోకపోతే ఉద్యోగం వద్దా అని చెప్పి లొంగదీసుకున్నాడు.. లైంగిక దోపిడీకి పాల్పడిన అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొంది. తాజా పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత కాసేపటికే యువతి పేరిట విడుదలైన ఆడియోలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేరు ప్రస్తావనకు రావడంతో కలకలం రేగుతోంది. మరోవైపు, రమేశ్ జార్ఖిహోళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సమస్య వచ్చింది. ఎదుర్కొంటా, భయపడను అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. రేపటి నుంచే నా అస్త్రాలు వదులుతా’ అని రమేష్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత తమపై కుట్ర మొదలైందని అన్నారు.


By March 27, 2021 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-cd-scandal-woman-files-plaint-against-ramesh-jarkiholi-through-advocate/articleshow/81720421.cms

No comments