Breaking News

కర్ణాటక రాసలీలల సీడీ: నాలుగో వీడియో వదిలిన యువతి.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు


కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాసలీలల సీడీ వ్యవహారం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం కాంగ్రెస్ నేత వెనుకుండి నడిపిస్తున్నారని సీడీలోని యువతి తల్లిదండ్రులు ఆరోపించడంతో కొత్త మలుపు తిరిగింది. ఇదిలా ఉండగా, నాలుగో సీడీని విడుదల చేసిన బాధిత యువతి.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.‘చనిపోవాలో, ప్రాణాలతో ఉండాలో తనకు అర్థం కావడం లేదని, రమేశ్‌ జార్ఖిహొళి పేరు రాసి చనిపోవాలని ఉంది’ అంటూ వాపోయింది. తన తల్లిదండ్రులు, సోదరులను అధికారులు లిపించి, విచారణ చేస్తున్నారని పేర్కొంది. సీడీ బయటకు వచ్చిన వెంటనే తనకు పరిచయం ఉన్న నరేశ్‌ను కలవడంతో దీనికి రాజకీయ నాయకుల మద్దతు అవసరమని ఆయనే చెప్పారని తెలిపింది. ఆయన సాయంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను కలవడానికి ప్రయత్నించినట్టు పేర్కొంది. తనకు భద్రత కోరేందుకే వారి వద్దకు వెళ్లానని, వారిని కలవడం కుదరలేదని వివరించింది. ఒక సీడీ బయటకు వచ్చిన తరువాత అందులో నిజమెంతో తెలియకుండా మీడియా కథనాలు ప్రసారం చేయడం బాధించిందని, తనకు న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనతోపాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని గత 24 రోజులుగా అభ్యర్థిస్తున్నానని, తాను ఏం మాట్లాడినా వివాదమవుతోందని వాపోయింది. త్వరలో విచారణకు హాజరై అధికారులకు అన్ని విషయాలు వివరిస్తానని ఆమె తెలిపింది. అయితే, యువతి రమేశ్‌ జార్ఖిహొళిపై ఆరోపణలు చేస్తుండగా, సిట్‌ విచారణకు హాజరైన అనంతరం ఆమె కుటుంబ సభ్యులు మాత్రం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా,‘వీడియోలో ఉన్నది నేను కాదు. గ్రాఫిక్స్‌తో దాన్ని తయారు చేశారని’ సీడీలోని యువతి తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో వైరల్‌ అవుతోంది. అయితే, వీడియోలో యాసకు, రక్షణ కోరుతూ విడుదల చేసిన వీడియోల్లోని యాసకు పొంతన లేకపోవడం గమనార్హం. వీడియోలో తాను లేనని చెబుతూనే, తాను వంచనకు గురయ్యానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.


By March 29, 2021 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-cd-case-woman-releases-new-video-claiming-torture-threat-to-family/articleshow/81742458.cms

No comments