Breaking News

మహారాష్ట్రలో దిగజారిన పరిస్థితి.. నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్


హారాష్ట్రలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో అత్యధికంగా 13,659 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కఠిన ఆంక్షలు విధించాలని ఆదేశించారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లో మళ్లీ విధించారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ విధించాల్సి రావచ్చునని ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు. మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. పాలు, నిత్యావసర సరకులు, కూరగాయలు, పండ్లు, మందుల షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని చెప్పారు. నాగ్‌పూర్‌లో గత 24 గంటల్లో 1800 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన ముంబైలో 1539 కేసులు, పుణేలో 1384 కేసులు, నాసిక్‌లో 750 కేసులు, యావత్మల్‌లో 403 కేసులు, ఔరంగాబాద్‌లో 560 కేసులు, పింప్రిచించ్వాడ్‌లో 590 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన ఆంక్షల వైపు మొగ్గు చూపుతోంది. జల్‌గావ్ జిల్లాలో జనతా కర్ఫ్యూ జల్‌గావ్‌ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మూడు రోజుల జనతా కర్ఫ్యూ విధించారు. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక్కడ జనతా కర్ప్యూ విధించిన రెండు రోజుల వ్యవధిలోనే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధించారు. ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే దిగజారితే రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.


By March 11, 2021 at 05:53PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-reports-highest-corona-cases-in-2021-on-march-11-lockdown-imposed-in-nagpur-for-one-week/articleshow/81450631.cms

No comments