Breaking News

హీరోగా మారిన మరో పాపులర్ కమెడియన్


‘ఇష్క్‌’, ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’, ‘గీతాంజ‌లి’, ‘ఒక లైలా కోసం’, ‘టాక్సీవాలా’ త‌దిత‌ర విజయవంతమైన సినిమాల్లో న‌టించిన పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా మారుతున్నారు. ‘గుండె క‌థ వింటారా’ అత‌నే థ్రిల్లర్‌ మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వంశీధ‌ర్ ర‌చించి, ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయని అన్నారు. మధునందన్‌కు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, పోస్టర్‌లో మ‌ధునంద‌న్ గుబురుగా పెంచిన గ‌డ్డంతో సిగ‌రెట్ తాగుతూ ఇంటెన్స్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. మ‌రో స్టిల్‌లో స్టాండ్ వేసిన బైక్‌కు ఆనుకొని నిల్చొని ఎవ‌రి కోస‌మో వెయిట్ చేస్తున్నారు. టైటిల్‌, పోస్టర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘గుండె క‌థ వింటారా’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌సాలా కాఫీ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా.. కృష్ణ చైత‌న్య పాట‌లు రాస్తున్నారు. ర‌వివ‌ర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్ సినిమాటోగ్రాఫీ అందించారు. సాయికిర‌ణ్ ముద్దం ఎడిటింగ్ బాధ్యత‌లు నిర్వర్తిస్తున్నారు. రియల్ సతీష్ యాక్షన్ డిజైన్ చేశారు.


By March 03, 2021 at 03:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/madhunandan-debuts-as-hero-with-gunde-katha-vintara/articleshow/81309511.cms

No comments