Breaking News

నందిగ్రామ్ బరిలో మమత.. బీజేపీకి సవాల్; క్రికెటర్‌కు టికెట్.. 291 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న వేళ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 291 స్థానాలకు గానూ అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ అధినేత్రి, సీఎం నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తారు. ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన మంత్రి అధికారి సువేందును దీదీ ఢీకొట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ఆమె తన స్థానమైన కోల్‌కతాలోని భవానీపూర్ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. భవానీపూర్ నుంచి మంత్రి సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ పోటీ చేస్తారని మమత ప్రకటించారు. దీంతో దీదీ రెండు చోట్లా పోటీ చేస్తారనే ప్రచారానికి తెర పడింది. టీఎంసీలో ఉండగా.. మమతా బెనర్జీ కుడి భుజంగా గుర్తింపు పొందిన సువేందు అధికారికి నందిగ్రామ్‌లో గట్టి పట్టుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసీ చేపట్టిన రైతు ఉద్యమం వెనుక ఆయన పాత్ర ఉంది. దీదీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తే ఆమెను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని సువేందు అధికారి నమ్మకంగా చెప్పారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పోటీ చేసేది ఎవరనే విషయాన్ని ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. 291 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలు ఉండగా.. 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 27 మందికి మమత టికెట్ నిరాకరించారు. ఇటీవలే టీఎంసీలో చేరిన భారత క్రికెటర్ మనోజ్ తివారీకి దీదీ టికెట్ ఇచ్చారు. హౌరాలోని శిబ్‌పూర్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. బెంగాల్ ఎన్నికలు 8 దశల్లో జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ మార్చి 27న జరగనుండగా.. చివరి దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరుగుతాయి. మే 2న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.


By March 05, 2021 at 03:32PM


Read More https://telugu.samayam.com/news/mamata-banerjee-to-contest-from-nandigram-as-tmc-announces-names-of-291-candidates/articleshow/81347590.cms

No comments