Breaking News

పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా ఓటు.. 2024 ఎన్నికల నాటికి ‘రిమోట్ ఓటింగ్’


పోలింగ్ రోజున బూత్‌లకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం ఇకపై ఉండదా? ఎక్కడి నుంచైనా ఓటు వేయెచ్చా? అంటే అవునంటోంది . ‘రిమోట్ ఓటింగ్’ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. బహుశా ఈ విధానం 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అందుబాటులోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్ వచ్చే రెండు మూడు నెలల్లో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ‘ఐఐటీ మద్రాస్, ఇతర ఐఐటీలకు చెందిన నిపుణులు, టెక్నోక్రాట్స్ రిమోట్ ఓటింగ్ లేదా బ్లాక్‌చైన్ ఓటింగ్ విధానంపై తీవ్రంగా కృషిచేస్తున్నారు.. తొలి పైలట్ ప్రాజెక్ట్ రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుందనే ఆశాభావంతో ఉన్నాం’ అని సంసద్ రత్న అవార్డుల బహుకరణ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ అరోరా అన్నారు. వచ్చె నెలలో సీఈసీ సునీల్ ఆరోరా పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. అలాగే, ఎన్ఆర్ఐలకు ఓటు హక్కునకు సంబంధించి ప్రాజెక్టు ఆరు నుంచి ఏడాదిలోగా పూర్తికావచ్చని అశాభావం వ్యక్తం చేశారు. ఈ-పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్ఐఆర్‌లకు ఓటు హక్కు కల్పించేలా నిబంధనలు సవరించాలనే ప్రతిపాదనలను కేంద్ర న్యాయశాఖకు ఈసీ పంపిందని తెలిపారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విదేశాంగ శాఖ సూచించినట్టు రాజ్యాంగ నిపుణులు, ప్రముఖులతో ఓ సెమినార్ ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. అధార్‌తో ఓటును అనుసంధానం చేయాలన్న ఈసీ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ చేసిన ప్రకటనను సునీల్ అరోరా స్వాగతించారు. దీని వల్ల ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రోత్సహిస్తోందని ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునిల్ అరోరా అన్నారు. అధునాత సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకుండానే ఓటువేసేలా రిమోట్ ఓటింగ్ ప్రాజెక్టుకు ఈసీ శ్రీకారం చుట్టింది. ‘ఈ ప్రాజెక్ట్ ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్‌ను లక్ష్యంగా చేసుకోలేదని లేదా ఇంటి నుంచి ఓటు వేయడాన్ని సూచించదని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ పారదర్శకత, గోప్యతను ఎల్లప్పుడూ ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది’ అని సీఈసీ పేర్కొన్నారు.


By March 21, 2021 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/remote-voting-facility-may-be-launched-in-2024-general-elections-says-cec/articleshow/81613127.cms

No comments