Breaking News

Vaishnav Tej ‘ఉప్పెన’ ట్విట్టర్ రివ్యూ: హిట్ కళ వచ్చేసిందట


మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘’. సుకుమార్ రైటింగ్స్‌లో.. ఆయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడి తొలి సినిమా కావడంతో.. వైష్ణవ్ తేజ్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కూడా ఈ చిత్రానికి దక్కడంతో పాజిటివ్ వైబ్స్‌తో ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 12) థియేటర్స్‌లో విడుదల కానుంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాకి మరింత హైప్ తీసుకుని రాగా.. హీరోయిన్ కృతి శెట్టి ఎక్స్ ప్రెషన్స్ కూడా సినిమాకు ప్రధానమైన బలంగా మారాయి. ఆమె క్యూట్ లుక్స్, పెర్ఫామెన్స్ యూత్‌ని మైమరపించేట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌లో కనిపించాయి. భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిన ‘ఉప్పెన’.. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన లాంటి కలెక్షన్లు రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. తొలిరోజు బుకింగ్స్ అన్నీ హౌస్ ఫుల్ కావడంతో పాటు యూఎస్ ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి. ఇక చాలాచోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడటంతో ట్విట్టర్ వేదికగా స్పందనలు తెలియజేస్తున్నారు. ఇక చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, ఇతర సెలబ్రిటీల ఈ చిత్ర విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. మరి ఉప్పెన చిత్రంపై ట్విట్టర్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. 1. థియేటర్ హౌస్ ఫుల్ అయ్యింది.. సినిమా చూడకుండానే హిట్ కల కనపడుతుంది.. హిట్ అయితే వెరీ హ్యాపీ. 2. ఈ సినిమాని 80 శాతం ప్రేక్షకులు విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసం చూస్తారు.


By February 12, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vaishnav-tej-and-krithi-shetty-starrer-uppena-movie-twitter-review-and-audians-reactions/articleshow/80871936.cms

No comments