Breaking News

ఎర్రకోట: కత్తుల ప్రదర్శనతో అలా దాడికి రెచ్చగొట్టాడు.. మోస్ట్ వాంటెడ్ అరెస్ట్


రిపబ్లిక్‌ డే రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా.. వద్ద కత్తులను ప్రదర్శిస్తూ విన్యాసాలు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మణిందర్ సింగ్ ఎర్రకోట వద్ద కత్తులను ప్రదర్శిస్తూ సంఘవిద్రోహ శక్తులను హింసకు ప్రేరేపించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసిన పోలీసులు నిందితుడిని మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక విభాగం మణిందర్‌ సింగ్‌‌ను మంగళవారం (ఫిబ్రవరి 16) సాయంత్రం పిఠాంపుర బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 30 ఏళ్ల మణిందర్‌ సింగ్ స్థానికంగా కారు ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ.. కత్తిసాము శిక్షణ స్కూల్‌ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 26న తన అనుచరులతో కలిసి ప్రణాళిక ప్రకారం రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌లో చేరాడని పోలీసులు ఆరోపించారు. అలా ఎర్రకోటకు చేరుకున్న మణిందర్ సింగ్.. కత్తులను ప్రదర్శిస్తూ సంఘవిద్రోహ శక్తుల్ని పోలీసులపైకి దాడికి ఉసిగొల్పాడని తెలిపారు. ఎర్రకోట ఘటనకు ముందు మణిందర్ సింగ్ పలుమార్లు సింఘు సరిహద్దుకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల విచారణలో అతడు అంగీకరించాడని డీసీపీ ప్రమోద్‌ కుష్వాహా తెలిపారు. అతడి వద్ద నుంచి 4 అడుగుల పొడవైన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.


By February 17, 2021 at 05:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/most-wanted-in-red-fort-violence-case-arrested-delhi-police-says-his-sword-dancing-motivated-protesters/articleshow/81058490.cms

No comments