Breaking News

లైంగిక వేధింపుల వాదనలు పక్కనబెట్టలేం.. ఆ జడ్జ్‌ క్రమశిక్షణా చర్యలకు అర్హుడే: సుప్రీంకోర్టు


జూనియర్ మహిళా న్యాయమూర్తితో వాట్సాప్ ద్వారా అభ్యంతకర మేసేజ్‌లు పంపిన జిల్లా జడ్జ్‌‌ను క్రమశిక్షణా చర్యలు నుంచి తప్పించడానికి నిరాకరించింది. లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ తరువాత బాధితురాలు సాక్ష్యం ఇవ్వడానికి నిరాకరించినా క్రమశిక్షణా చర్యలకు ఆయన అర్హుడేనని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళా న్యాయమూర్తి ఆరోపణలపై విచారణకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ కమిటీని నియమించింది. అయితే, బాధితురాలు ఈ కమిటీకి సాక్ష్యాలను ఇవ్వడానికి నిరాకరించింది. బాధితురాలు, జిల్లా న్యాయమూర్తి మధ్య రాజీ కుదిరిందని, కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఆమె నిరాకరించిందని కమిటీ తెలిపింది. ఏదేమైనా, కమిటీ తన నివేదికకు ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ను జతచేసింది. పదవీ విరమణ చేసిన జిల్లా న్యాయమూర్తిపై క్రమశిక్షణా చర్యలను ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. వినిపించిన సీనియర్ న్యాయవాది ఆర్ బాలసుబ్రమణియన్ ద్వారా వాదనలు వినిపించిన జిల్లా న్యాయమూర్తి.. హైకోర్టు న్యాయమూర్తిగా తన పేరు పరిశీలనలో ఉన్న సమయంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆ అవకాశాన్ని తాను కోల్పోయానని తెలిపారు. మహిళా న్యాయమూర్తి సాక్ష్యం ఇవ్వడానికి నిరాకరించినందున కమిటీ కేసును మూసివేసిందని, వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా క్రమశిక్షణా చర్యలను తీసుకోలేరని ఆయన అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. లైంగిక వేధింపుల ఫిర్యాదులను కార్పెట్ కింద కప్పి ఉంచడానికి మేము అనుమతించలేమని వ్యాఖ్యానించింది. జిల్లా న్యాయమూర్తి తరఫున దాఖలు చేసిన పిటిషన్‌ను తాను ఉపసంహరించుకుంటానని న్యాయవాది బాలసుబ్రమణియన్ కోరగా.. అందుకు ధర్మాసనం అనుమతించింది.


By February 27, 2021 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sexual-harassment-plaints-cant-be-brushed-aside-says-supreme-court/articleshow/81239463.cms

No comments