Breaking News

ఖషోగ్గీ హత్యకు సౌదీ యువరాజే ప్రధాన సూత్రధారి.. అమెరికా సంచలన ప్రకటన


వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక మొహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజును నిందితుడిగా పేర్కొంటూ అమెరికా ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఆయన అనుమతితోనే ఖషోగ్గీని ఇస్తాంబుల్‌లో హత్యచేశారని పేర్కొంది. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీని పట్టుకోవడం లేదా చంపడానికి నిర్వహించే ఆపరేషన్‌కు సౌదీ యువరాజు ఆమోదం వేశాడని తెలిపింది. యువరాజు మొహమ్మద్ ప్రభావాన్ని చూస్తే 2018లో జరిగిన హత్య ఆయన ప్రమేయం లేకుండా జరగడం చాలా అరుదు అని నివేదిక పేర్కొంది. ఈ హత్య విదేశాలలో తన అసమ్మతివాదులను నోళ్లేత్తుకుండా చేయడానికి, యువరాజు హింసాత్మక చర్యలకు సరిపోతుందని వ్యాఖ్యానించింది. వాషింగ్టన్ పోస్ట్‌లో యువరాజుపై తరుచూ విమర్శనాత్మక కథనాలను రాస్తూ ఆయన ఆగ్రహానికి గురయ్యాడని తెలిపింది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారితోపాటు ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ ఫోర్స్ ఆస్తులను స్తంభింపజేయడం, లావాదేవీలను నిలిపివేయడం చేసినట్టు ట్రెజరీ విభాగం ప్రకటించింది. ‘నాటి నివేదిక యువరాజును రక్షించడానికి ప్రయత్నించింది, అతనికి మాత్రమే సమాధానాలు ఇస్తుంది’ అని పేర్కొంది. అమరుడైన జర్నలిస్ట్ గౌరవార్దం ఆయన పేరుతో ‘ఖషోగ్గీ చట్టం’తీసుకువచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా జర్నలిస్ట్‌‌లు, వారి కుటుంబాలను బెదిరించడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడిన విదేశీయులకు అమెరికాలో ప్రవేశం నిషేధమని తెలిపారు. తక్షణమే 76 మంది సౌదీ పౌరులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్టు తెలిపారు. ‘సామాజిక కార్యకర్తలు, అసమ్మతివాదులు, జర్నలిస్టులపై బెదిరింపులు, దాడులను ముగించాలని మేము ఖచ్చితంగా సౌదీ అరేబియాకు స్పష్టం చేశాం.. వాటిని అమెరికా ఎన్నటికీ సహించదు’ అని బ్లింకేన్ అన్నారు. కానీ మిత్రపక్షం నాయకుడిపై ఆంక్షలు విధించటానికి తటాపటాయిస్తున్న అమెరికా.. యువరాజుపై విమర్శలతో సరిపెట్టింది. సౌదీ, అమెరికా సంబంధాలు దెబ్బతినకుండా విలువలకు అనుగుణంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన వివరించారు.


By February 27, 2021 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/saudi-prince-salman-approved-operation-to-capture-or-kill-khashoggi-us-report/articleshow/81240002.cms

No comments