Breaking News

సెంచరీ కొట్టిన పెట్రోల్.. స్వీట్లు పంచుతూ బిహారీల వినూత్న నిరసన


గతంలో ఎన్నడూ లేని రీతిలో పెరుగుతున్నాయి. దేశంలో కొన్ని చోట్ల లీటర్ పెట్రోల్ రేటు రూ.100 దాటింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. దాని ప్రభావం రవాణా, నిత్యవసరాలపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ.. వాణిజ్య సంఘాలు ఇటీవలే భారత్ బంద్ సైతం చేపట్టాయి. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని చూస్తున్న వేళ.. చాలా మంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి కారులోకి ఇంధనం నింపిస్తూ.. ఎదురుగా మోదీ నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు నమస్కరిస్తూ.. నిరసనను వ్యక్తం చేశాడు. కొందరైతే పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరగానే.. పెట్రోల్ బంక్‌లో బ్యాట్ పైకెత్తి సెంచరీ చేసినట్లుగా అభివాదం చేసి మోదీ సర్కారుపై సెటైర్లు వేశారు. తాజాగా బిహారీలోని దర్బంగా ప్రజలు పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా స్వీట్లు పంచిపెట్టి మోదీ సర్కారుపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు ఇదే రీతిలో పెరిగితే.. దాని ప్రభావం అన్ని రంగాలపై పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సైతం ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. చలికాలం ముగిసిన తర్వాత పెట్రోలియం ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే సంకేతాలిచ్చారు. ఒకే నెలలో పెట్రోల్ ధర రూ.5 తగ్గిందంటూ 2014 ఆగస్టులో గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత సీఆర్ పాటిల్ ట్వీట్ చేయగా... ప్రస్తుతం ఆ ట్వీట్‌ను బయటకు తీసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. 2015లో రూ.56.49గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర.. ఏటా క్రమేణా పెరుగుతూ 2021 నాటికి రూ.101.84కు చేరిందంటూ కౌంటర్ ఇచ్చింది.


By February 28, 2021 at 03:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-people-distributed-sweets-to-show-anger-after-the-price-of-petrol-crossed-rs-100-per-litre-/articleshow/81256250.cms

No comments