Breaking News

ఈ టాయిలెట్‌లోకి మహిళలు గానీ, పురుషులు గానీ రావొద్దు.. వారణాసిలో ప్రత్యేకం!


గరాలు, పట్టణాల్లో పబ్లిక్ ప్రదేశాల్లో పురుషుల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు ఉంటాయి. మరి ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి ఏమిటి? పురుషుల టాయిలెట్‌కి వెళ్లినా, మహిళల టాయిలెట్‌లోకి వెళ్లినా తమను వింతగా చూస్తారని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తాము నరకం ఎదుర్కొంటామని గోడు వెళ్లబోసుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇలాంటి వారికి ఊరట కలిగించేలా కీలక అడుగు వేసింది. వారణాసిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక టాయిలెట్‌ను ప్రారంభించారు. వారణాసిలో మంగళవారం (ఫిబ్రవరి 16) యూపీలోనే తొలి ట్రాన్సెజెండర్ల టాయిలెట్‌ను ప్రారంభించారు. మేయర్ మృదుల జైస్వాల్ రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు ట్రాన్సెజెండర్లు పాల్గొన్నారు. తమ కోసం తొలిసారిగా ఒక ప్రత్యేక టాయిలెట్ ఏర్పాటు కావడం పట్ల హర్షం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వారణాసి నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హిజ్రాల కోసం ప్రత్యేకంగా టాయిలెట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ట్రాన్సె‌జెండర్ల కోసం మరో 3 టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని మేయర్ మృదుల జైస్వాల్ చెప్పారు. కాగా, దేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం మొట్టమొదటిసారిగా భోపాల్ నగరంలో ప్రత్యేక టాయిలెట్‌ను ప్రారంభించారు. 2017 అక్టోబర్ 2న అక్కడ హిజ్రాల కోసం ప్రత్యేకంగా టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. Also Read: ✦ ✦ ✦


By February 17, 2021 at 01:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradeshs-first-community-toilet-for-transgenders-inaugurated-in-varanasi/articleshow/81010307.cms

No comments