Breaking News

భారత్ స్ట్రెయిన్‌లు మరింత ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు


దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యమని ఎందుకంటే మొత్తం జనాభాలో కనీసం 80 శాతం మందిలో కోవిడ్ యాండీబాడీలు ఉండాలని డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో గుర్తించిన కొత్త వేరియంట్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, ప్రమాదకరమైంది అని పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పటికే కోవిడ్ యాంటీబాడీలున్న వారు సైతం ఈ వేరియంట్‌ వల్ల మరోసారి వైరస్ బారినపడే అవకాశం ఉందని అన్నారు. గడచిన రోజులుగా కొత్త కేసులు పెరగడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 240 కొత్త స్ట్రెయిన్‌లు కారణమని మహారాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి పేర్కొన్నారు. మహారాష్ట్రతో పాటు కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్‌లోనూ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రణాళిక రోగనిరోధక శక్తిని కలిగించడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సృష్టించడం మీద ఆధారపడి ఉంటుంది. తొలి దశలో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత దశలో 50 ఏళ్లు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. కరోనా వైరస్ మ్యూటేషన్ లేదా వేరియంట్స్ వ్యాధినిరోధకత నుంచి తప్పించుకుంటోందని, దీని వల్ల దేశంలో హెర్డ్ ఇమ్యమూనిటీ లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని గులేరియా అన్నారు. వ్యాక్సిన్ లేదా వ్యాధి ద్వారా ఒక వ్యక్తి యాంటీబాడీలు సాధించినా జన్యుమార్పిడి వల్ల మరోసారి వైరస్ బారినపడే ముప్పు ఉందన్నారు. ఈ సమయంలో కోవిడ్-19 నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్నే మరోసారి అవలంభించాలని పేర్కొన్నారు. కొత్తరకం స్ట్రెయిన్‌లపై టీకా పనిచేసినా.. సామర్థ్యంగా తక్కువగా ఉండే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ వ్యాధిని నివారించలేకపోవచ్చు, కానీ దాని తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారని వివరించారు. వైరస్ జన్యుమార్పడికి గురికావడంతో టీకాలు పనిచేయకపోతే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.


By February 21, 2021 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-indian-strains-of-coronavirus-could-be-more-infectious-says-aiims-chief/articleshow/81134510.cms

No comments