Breaking News

ఓవైసీ మాకు సహకరించారు... బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపూ కీలక వ్యాఖ్యలు చేశారు . ఓవైసీ పార్టీ బెంగాల్‌లో పోటీ చేయడంపై సాక్షి మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంగాల్ బరిలోకి దిగడం బీజేపీకే కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేయడంపై కూడా స్పందించారు. అది దేవుడి దయ. దేవుడు అతనికి బలాన్నిస్తాడు. అతను మాకు బిహార్‌లో సహాయం చేశాడు. యూపీలో చేశాడు. ఇప్పుడు బెంగాల్‌లోనూ సహాయం చేస్తాడంటూ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ మహారాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఒవైసీ బీజేపీకి ‘బీ టీమ్’ అని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తూ వస్తుంది.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేస్తూ వస్తుంది. అయితే బీజేపీకి పరోక్షంగా సహాయం చేయడానికే ఎంఐఎం అధినేత అన్ని చోట్ల పోటీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. ఆయా రాష్ట్రాలో బీజేపీ గెలుపున‌కు ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తోడ్పాటు అందిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఎంఐఎం వ‌ల్లే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుందన్నారు. త్వరలో జ‌ర‌గ‌బోయే పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక‌ల్లో కూడా ఎంఐఎం పోటీ చేస్తుందంటూ ప్రకటించారు బీజేపీ ఎంపీ. దీంతో.. అక్కడ కూడా బీజేపీ గెలుపుకు అసదుద్దీన్ ఒవైసీ స‌హ‌క‌రించ‌బోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తూ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు సాక్షి మహారాజ్.


By January 14, 2021 at 01:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mp-sakshi-maharaj-sensational-comments-on-mim-mp-asaduddin-owaisi/articleshow/80265637.cms

No comments