Breaking News

టాలీవుడ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: ఫ్యామిలీస్‌తో మహేష్, బన్నీ.. భర్తలతో చిల్ అవుతున్న సమంత, కాజల్!


టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ నూతన సంవత్సర వేడుకలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య న్రమత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలు సందడిగా జరుపుకున్నారు. ఈ ఫొటోలను నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో సింపుల్ కాజువల్ కాస్ట్యూమ్‌లో మహేష్ బాబు మెరిసిపోతున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంట్లోనే కుటుంబంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఒక ఫొటోను అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో బన్నీ తీసుకున్న సెల్ఫీ ఇది. ఇక ప్రస్తుతం గోవాలో భర్త నాగచైతన్యతో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్న సమంత తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో భర్త నాగచైతన్యను ప్రేమగా ముద్దాడుతూ కనిపించారు సమంత. మరోవైపు కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు సిమ్లాలో చిల్ అవుతున్నారు. సిమ్లాలోని కుఫ్రీ పర్వతాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మంచు కొండల్లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కాజల్.. తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లతోపాటు మరో జంట నిఖిల్ సిద్ధార్థ్, పల్లవి కూడా సిమ్లాలోని కుఫ్రీలోనే ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో డాక్టర్ పల్లవిని పెళ్లాడిన నిఖిల్.. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఆమెతో కలిసి మంచు కొండల్లో సంతోషంగా జరుపుకున్నారు. భార్యతో కలిసి కుఫ్రీ మంచు కొండల్లో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నిఖిల్.. అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ తమ స్టైల్లో సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జు్న్, చిరంజీవి, వరుణ్ తేజ్, వెంకటేష్.. ఇలా సినీ ప్రముఖలంతా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.


By January 01, 2021 at 02:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-allu-arjun-samantha-kajal-aggarwal-celebrates-new-year-with-their-loved-ones/articleshow/80058592.cms

No comments