గుడ్ న్యూస్.. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. కేంద్ర మంత్రి ప్రకటన

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కేంద్రం డై రన్ చేపడుతున్న వేళ.. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ గుడ్ న్యూస్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లను దేశమంతటా ఉచితంగా అందిస్తామన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను పరిశీలించడానికి ఓ హాస్పిటల్‌కు వెళ్లిన మంత్రి.. దేశమంతటా కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. బిహార్‌లో తమ కూటమి అధికారంలోకి వస్తే.. బిహారీలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని బీజేపీ చేసిన ప్రకటన అప్పట్లో చర్చనీయాంశమైంది. బిహారీలకే ఉచితంగా ఇస్తారా..? అనే ప్రశ్నను చాలా మంది లేవనెత్తారు. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇప్పటి దాకా 70 లక్షల మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ Co-WIN యాప్‌లో ఇప్పటి వరకు 70,33,338 మంది పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్.. ఆక్స్‌ఫర్డ్ రూపొందించి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నేడు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు అర్జెంటినా ఇప్పటికే ఆమోదం తెలిపాయి.
By January 02, 2021 at 12:15PM
No comments