Breaking News

ఎర్రకోటలోకి దూసుకొచ్చిన రైతులు.. కోటపై జెండా ఆవిష్కరణ


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల నిర్బంధాన్ని తోసుకుంటూ ఆందోళనకారులు చారిత్రక ఎర్రకోటకు చేరుకున్నారు. ప్రాంగణంలో ఓ స్తంభంపై తమ జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. కోట ప్రాంగణంలో భైఠాయించారు. రైతులను నిలువరించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. , జల ఫిరంగులు ప్రయోగించినా వెరవకుండా ముందుకు దూసుకొచ్చారు. లాఠీఛార్జ్ చేసినా రైతులు వెనుకడుగు వేయలేదు. లాఠీ దెబ్బలు తింటూ కూడా కొంత మంది ఆందోళనకారులు అలాగే ముందుకు వచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్లను పక్కకు లాగేసి, అడుగడుగునా ఏర్పాటు చేసిన నిర్బంధాన్ని బద్దలుకొట్టుకుంటూ ఎర్రకోట చేరుకున్నారు. వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఎర్రకోట వైపు దూసుకొచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. రైతులను నిలువరించడానికి పోలీసులు ఒక చోట దారికి అడ్డంగా భారీ ట్రక్కును నిలిపి ఉంచగా.. రైతులు తమ ట్రాక్టర్లతో దాన్ని పక్కకు లాగేసి ముందుకెళ్లారు. బారీకేడ్లను ఎక్కడికక్కడ రోడ్డు పక్కకు తోసేశారు. రైతులు పక్కా ప్రణాళికతో ఎర్రకోట వైపు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం.. మంగళవారం (జనవరి 26) ఎర్రకోటలో రిపబ్లిక్ వేడుకలు ముగిసిన తర్వాత రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాల్సి ఉండగా.. ఉదయమే ర్యాలీగా బయల్దేరారు. సింఘు, టిక్రీ తదితర సరిహద్దుల నుంచి వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ వైపు దూసుకొచ్చారు. అనుమతి ఇచ్చిన మార్గాల్లోనే కాకుండా ఇతర మార్గాల్లోకి కూడా ప్రవేశించారు. అనంతరం ఎర్రకోట వైపు దూసుకొచ్చారు. కోట ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు. రైతులను అక్కడ నుంచి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. Also Read: ✦ ✦


By January 26, 2021 at 02:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tractor-rally-protestors-enter-red-fort-wave-flags-from-the-ramparts-of-the-fort/articleshow/80464921.cms

No comments