Breaking News

ఇక గురి తప్పదంటున్న గోపీచంద్, తమన్నా.. మొత్తానికి ఫైనల్ అయ్యారు!


మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''. వైవిద్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో సరైన హిట్ పడకపోవడంతో ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గోపీచంద్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొన్నారట. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో కబడ్డీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. గోపీచంద్, తమన్నా ఇద్దరు కూడా కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటిస్తున్నారు. చిత్రంలో తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. సీనియర్ నటి భూమిక కీలక పాత్ర పోషిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆంధ్రా టీమ్‌ ఫీమేల్‌ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా మధ్య నడిచే సన్నివేశాలు సినిమాలో హైలైట్ కానున్నాయని టాక్. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుదలపై తాజాగా ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతిత్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ మేరకు ఉగాది స్పెషల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి రిలీజ్ విషయంలో ఆలస్యం చేయకుండా ఉగాదికి రావాలని బలంగా ఫిక్సయ్యారట. చూడాలి మరి ఈ సీటీమార్ సినిమాతో అయినా గోపీచంద్ తిరిగి ట్రాక్ ఎక్కుతారా? లేదా అనేది.


By January 25, 2021 at 10:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/update-on-hero-gopichand-siteemar-release-date/articleshow/80443203.cms

No comments