Breaking News

కారుతో పాటు భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు.. లబోదిబోమన్న భర్త, చివర్లో ఊహించని ట్విస్ట్


భార్యను కారులోనే వదిలి పిల్లల ఫీజు కట్టేందుకు స్కూల్‌లోకి తీసుకెళ్లిన భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చారు దొంగలు. భార్యతో సహా కారును ఎత్తుకుపోయారు.ఈ ఘటన పంజాబ్‌లోని డేరా బస్సీ ప్రాంతంలో జరిగింది. డేరా బస్సికి చెందిన రాజీవ్‌ చంద్‌, రీతు దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజు చెల్లించడానికి గురువారం మధ్యాహ్నం దంపతులు పాఠశాలకు కారులో వెళ్లారు. కారు తాళం చెవి అలాగే ఉంచి రాజీవ్ స్కూల్‌ లోపలికి వెళ్లగా రీతు భర్త కోసం కారులోనే వేచి చూస్తోంది. Also Read: అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారులోకి చొరబడ్డారు. ఒకరు డ్రైవింగ్ చేయగా మరొకరు రీతు నోరు నొక్కి పట్టుకున్నారు. సుమారు ఐదు కిలోమీటర్లు వెళ్లిన అనంతరం రీతూని కారులో నుంచి తోసేసి వెళ్లిపోయారు. స్కూల్ నుంచి బయటికి వచ్చిన రాజీవ్‌ అక్కడ కారు, భార్య కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. భార్యకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరుకున్న రీతు జరిగిన ఘటన గురించి భర్తకు చెప్పి బోరుమంది. భార్య క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో రాజీవ్ ఊపిరి పీల్చుకున్నాడు. కారును ఎత్తుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By January 08, 2021 at 03:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/punjab-man-leaves-keys-inside-car-carjackers-drive-off/articleshow/80169606.cms

No comments