మద్యం డబ్బుల కోసం అమ్మమ్మ హత్య... కర్నూలు జిల్లాలో యువకుడి ఘాతుకం

మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు అమ్మమ్మనే హత్య చేసిన ఘటన జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. పుల్లారెడ్డి వీధిలో ఉంటున్న హుస్సేన్‌బీ(75)కి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. భర్త ఖాదర్‌బాషా వ్యవసాయశాఖలో పనిచేస్తూ మృతి చెందటంతో వచ్చే పింఛన్ సొమ్ముతో ఆమె జీవనం కొనసాగిస్తోంది. గతేడాది అక్టోబరులో చిన్న కుమారుడు అల్తాఫ్(40) కరోనాతో మృతి చెందడంతో హుస్సేన్‌బీ కుంగిపోయింది. ఆ బాధతో ఉండగానే.. గూబగుండం గ్రామంలో ఉంటున్న పెద్ద కూతురు కుమారుడైన ఇక్బాల్ తరచూ ఆమె వద్దకు వచ్చి డబ్బు కోసం వేధించేవాడు. శుక్రవారం అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో ఉండగా ఇక్బాల్ తన అమ్మమ్మ వద్దకు వచ్చి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని ఘర్షణ పడ్డాడు. కాసేపటి తర్వాత ఆరుబయటి అచేతనంగా పడివున్న వృద్ధురాలిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: ఎస్ఐ రామిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి పెద్ద కుమారుడు అమిర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్బాల్ ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే ప్రియురాలితో కలిసి డబ్బు, మెడలోని బంగారు గొలుసు కోసం అమ్మమ్మను గొంతు నులిమి చంపేసినట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
By January 02, 2021 at 10:31AM
No comments