Breaking News

రవితేజ బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. క్రాక్‌తో పిచ్చెక్కించి 'ఖిలాడీ'గా పరేషాన్ చేసున్న మాస్ మహారాజ్!!


నేడు (జనవరి 26) మాస్ మహారాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ '' నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఇటీవలే క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రవితేజ అదే జోష్‌లో ఈ 'ఖిలాడీ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 'రాక్షసుడు' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన దర్శకుడు రమేశ్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మాణ బాధత్యలు చేపట్టారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో రవితేజను చాలా పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. చేతిలో సుత్తి పట్టుకుని కంటైనర్‌ బాక్సుల నడుమ రవితేజ స్టైలీష్‌గా నడుస్తున్న లుక్ చూసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వింటుంటే ఈ మూవీలో రవితేజ రోల్ ఏ రేంజ్‌లో ఉండనుందనేది అర్థమవుతోంది. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ ఖిలాడీ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ కూడా అదే రేంజ్‌లో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. అతిత్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ వేసవిలో 'ఖిలాడీ'ని థియేటర్స్‌లో దించాలని చూస్తోంది చిత్రయూనిట్.


By January 26, 2021 at 11:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ravi-teja-latest-movie-khiladi-first-glimpse-released/articleshow/80463054.cms

No comments