Breaking News

ఆస్పత్రి ఎన్ఐసీయూలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం.. పది మంది నవజాత శిశువులు మృతి


మహారాష్ట్రలోని ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి, పది మంది నవజాత శిశువులు (అప్పుడే పుట్టిన పిల్లలు) మృతిచెందారు. భండారా జిల్లా ఆస్పత్రిలోని ఎస్ఎన్ఐసీయూలో అర్ధరాత్రి ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి ఎన్ఐసీయూలో 17 మంది నవజాత శిశువులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు భండారా ఆస్పత్రి సివిల్ సర్జన్ ప్రమోద్ ఖాందాతే వెల్లడించారు. పది మంది నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఏడుగుర్ని రక్షించినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎన్ఐసీయూ గదిలో నుంచి పొగ వస్తున్న విషయాన్ని గమనించిన నర్సు.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు తక్షణమే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


By January 09, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ten-children-died-in-fire-broke-out-at-general-hospital-in-maharashtra/articleshow/80181394.cms

No comments