Breaking News

ప్రేమపెళ్లికి ఒప్పుకోని పేరెంట్స్.. మరొకరితో ప్రియుడు.. యువతి ఆత్మహత్య


ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నింపింది. వాంకిడి మండలంలోని చిన్నవాంకిడి గ్రామానికి చెందిన సొనూర్లె నాందేవు-శోభా దంపతులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. ముగ్గురు కూతుళ్లకు వివాహాలు జరగ్గా... నాలుగో కూతురు మౌనిక(20) అదే గ్రామానికి చెందిన వడ్గురె రంజిత్‌లు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల మౌనికను పెళ్లి చేసుకుంటానని రంజిత్ ఆమె తల్లిదండ్రులను కోరగా వారు నిరాకరించారు. ఎంత బ్రతిమాలినా వారు ససేమిరా అనడంతో రంజిత్ పెద్దలు నిశ్చయించిన మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక మంగళవారం ఉదయం ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. బుధవారం తెల్లవారుజామున జంబుల్‌ధరి గ్రామ సమీపంలోని సొంత పత్తి చేనులో ఆమె విగతజీవిగా కనిపించింది. సంఘటనా స్థలం వద్ద పురుగుల మందు డబ్బా ఉండడం, నోటి నుంచి నురుగు రావడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి నాందేవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 07, 2021 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-for-parents-refused-her-love-marraige-in-telangana/articleshow/80145873.cms

No comments