Breaking News

ప్రియుడితో కూతురిని రేప్ చేయించిన మహిళ.. 15ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చి


భర్తను వదిలేసి పరాయి వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓ మహిళ కూతురి విషయంలో అత్యంత నీచానికి పాల్పడింది. ప్రియుడితో కన్న కూతురిపైనే అనేకసార్లు లైంగిక దాడికి ఉసిగొల్పింది. ఆ కామాంధుడి కారణంగా గర్భం దాల్చిన బాలిక 15ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లి, ఆమె ప్రియుడిని డిసెంబర్ 30వ తేదీన అరెస్ట్ చేశారు. Also Read: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని శోలింగనల్లూరుకు చెందిన నందిని(పేరు మార్చాం) కొంతకాలం క్రితం భర్త నుంచి విడిపోయి 15ఏళ్ల కూతురితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ పెయింటర్‌తో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. తరుచూ ప్రియురాలి ఇంటికెళ్లి కామ కోరికలు తీర్చుకునే పెయింటర్‌ ఆమె కూతురిపైనా కన్నేశాడు. తప్పని చెప్పాల్సిన నందిని కూడా ప్రియుడికి మద్దతు పలికి కూతుర్ని అతడి గదిలోకి పంపేది. దీంతో ఆ కామాంధుడు బాలికపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. Also Read: ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కూతురిని బెదిరించిన నందిని.. కొద్దిరోజుల తర్వాత ఆమెను తన అన్న ఇంట్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది. బాలిక శరీరంలో మార్పులు గమనించిన మేనమామ ఆరా తీయగా బాధితురాలు అసలు విషయం చెప్పింది. దీంతో అతడు మడిపక్కం మహిళా పోలీసులను సంప్రందించి బాలిక పరిస్థితి వివరించి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలోనే బాలిక గత అక్టోబరులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికి గాలింపు ప్రయత్నాలు ఫలించి బాలిక తల్లి, ఆమె ప్రియుడు డిసెంబర్ 30న పోలీసులకు పట్టుబడ్డారు. బాలిక జీవితాన్ని నాశనం చేసిన వారిద్దరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


By January 02, 2021 at 01:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chennai-woman-lets-boyfriend-rape-impregnate-15-year-old-daughter/articleshow/80070390.cms

No comments