Breaking News

కరోనా కొత్త స్ట్రెయిన్.. పిల్లలు జాగ్రత్త అంటున్న WHO


దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో... కొత్త స్ట్రెయిన్‌ కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. యూకేలో పుట్టి క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తోంది ఈ వైరస్. భారత్‌లోనూ యూకే నుంచి వచ్చినవారిలో పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అది కొత్త స్ట్రెయినా లేదా పాతదేనా? అనేది తేల్చేపనిలో పడిపోయారు నిపుణులు. అయితే, తాజాగా కరోనా కొత్త స్ట్రెయిన్‌పై హెచ్చరించింది . ఈ కొత్త స్ట్రెయిన్‌ పై WHO పలు హెచ్చరికలు చేసింది. దీంతో యువతకు, పిల్లలకూ కొత్త రకం వైరస్ ప్రమాదకరమేనని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌వో. కొత్త స్ట్రెయిన్‌.. ఏస్‌2 గ్రాహకాలను ఛేదించి చొచ్చుకెళ్తోంది. దీంతో పిల్లలకు సులభంగా సోకే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. యూకేలో నమోదవుతున్న కేసుల్లో 15 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య భారీగా ఉండడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అయితే, కొత్త స్ట్రెయిన్‌.. పిల్లలపై ప్రత్యేకంగా దాడి చేస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పలేం అంటున్నారు బ్రిటన్‌ ఆరోగ్య నిపుణురాలు వెండీ బార్ల్కే. Read More: బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కరోనా కొత్త స్ట్రెయిన్‌.. యూరప్‌లోని మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటికి 8 దేశాలకు వ్యాపించింది. తాజాగా స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇలాంటి కేసులే నాలుగు నమోదు కావడం కలవరపెడుతోంది. డిసెంబర్‌ మొదటి వారంలో బ్రిటన్‌లో సగటున రోజుకు 15 వేల వైరస్‌ కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 38 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతె ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. దక్షిణాఫ్రికాలో డిసెంబర్‌ మొదటి వారంలో సగటున రోజుకు 4 వేల వైరస్‌ కేసులు రికార్డవ్వగా.. ప్రస్తుతం 14 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో ఇజ్రాయెల్‌ మూడోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. ఆదివారం లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


By December 27, 2020 at 10:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/world-health-organization-on-new-coronavirus-strain/articleshow/79974469.cms

No comments