Breaking News

Sam Jam: సమంత చిలిపి ప్రశ్న.. ఒక్క సైగతో అక్కినేని కోడలిని ఆటపట్టించిన చిరంజీవి.. వీడియో వైరల్


వెండితెరపై అయినా రియల్ లైఫ్‌లో అయినా ఎంతో ఫన్ క్రియేట్ చేస్తూ అభిమానుల చేత భేష్ అనిపించుకుంటూ ఉంటుంది . ఆమె చలాకీతనం, సందర్భానుసారంగా మాట్లాడేతీరును ఎంతోమంది ఇష్టపడుతుంటారు. పెళ్లికి ముందే హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. కోడలిగా అక్కినేని వారింట అడుగుపెట్టాక మరింత జోష్ పెంచేసింది. కేవలం సినిమాలే గాక పలు రంగాల్లో అడుగులేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ క్రమంలోనే 'ఆహా' ఓటీటీ వేదికపై '' ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేస్తూ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను రాబడుతోంది. ఇటీవలే 'ఆహా' ఓటీటీ వేదికపై మొదలైన 'సామ్ జామ్' టాక్ షో సక్సెస్ బాటలో కొనసాగుతోంది. మొదటి గెస్ట్‌గా సమంతతో విజయ్ దేవరకొండ ముచ్చటలాడగా.. ఆ తర్వాత రానా, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు ఈ ప్రోగ్రాంకి వచ్చారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ వంతు వచ్చేసింది. క్రిస్మస్ రోజున సమంత- చిరంజీవి సందడి చూడబోతున్నారు ఆడియన్స్. Also Read: అయితే తాజాగా ఇందుకు సంబంధించి చిన్న ప్రోమో వీడియో విడుదల చేయగా.. అందులో సమంత వేసిన చిలిపి ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన కొంటె సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టాక్ షోకి వచ్చిన సెల‌బ్రిటీల‌ను ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడుగుతూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న సమంత.. 'మీ ఫ్రీజ్‌లో ఎప్పుడూ ఉండే ఓ ఐటెం ఏంటి?' అని చిరంజీవిని అడిగింది. దీనిపై రియాక్ట్ అయిన చిరు ఒకే ఒక్క సైగతో హింట్ ఇస్తూనే.. ఆ తర్వాత మీరనుకునేది కాదంటూ దాటేశారు. చిరంజీవి సైగ చూడగానే సమంత 'ఆ..!' అనేయడం ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సామ్ జామ్ ఫుల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


By December 20, 2020 at 11:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sam-jam-chiranjeevi-samantha-conversation-goes-viral/articleshow/79822255.cms

No comments