Breaking News

Rahul Gandhi: రాష్ట్రపతి భవన్‌కు రాహుల్‌గాంధీ.. రైతులకు మద్దతుగా కాలినడకన


ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం అందజేయనుంది. ఇవాళ కాలినడకన వెళ్లనున్నారు. రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్‌ నిర్వహించనున్నారు. ఓ మెమో రండంతో పాటు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రెండు లక్షల సంతకాలను రాష్ట్రపతికి సమర్పించనున్నారు. నూతన చట్టాలను రద్దు చేయడం, ఈ విషయంలో రాష్ట్రపతి కోవింద్ జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణను చేపట్టింది. రైతు ఉద్యమానికి సంఘీభావంగా విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ మార్చ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. పార్లమెంట్ భవనం దగ్గర లోని విజయచౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన వెళ్లి రాష్ట్రపతి కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్నారు. Read More: మూడు 'నల్ల వ్యవసాయ' చట్టాలను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ 28 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీల మద్దతు లభించింది. గత వారం రాష్ట్రపతిని కలిసి రైతుల డిమాండ్ పై జోక్యం చేసుకోవాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని రాహుల్ గాంధీ తో పాటు, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు అందజేసారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.


By December 24, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rahul-gandhi-to-hold-congress-protest-march-on-thursday/articleshow/79933422.cms

No comments