‘రామలక్ష్మి’గా సమంత సెట్ కాదన్నారట... కానీ అదే పాత్రలో అదరగొట్టింది
తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా ‘’ . స్టార్ హీరో రామ్‌చరణ్‌తో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో చెవిటి వ్యక్తిగా చిట్టిబాబు పాత్రలో చెర్రీ పరకాయ ప్రవేశం చేశాడు. అతడికి పోటీగా రామలక్ష్మి పాత్రలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో అందం, అభినయంతో ఆకట్టుకుని తానేంటో మరోసారి నిరూపించుకుంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలనుకోలేదట. ‘నేను ఇద్దరు అగ్ర నటుల్ని (చెర్రీ, సామ్) మ్యానేజ్ చేయలేనేమో అనిపించింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించాలంటే కొత్త ముఖం కావాలి. ఇందుకు తెలుగు వచ్చిన మరో నటిని ఎంపిక చేస్తే సరిపోతుందని అనుకుని సమంతను వద్దనుకున్నా. కానీ, చివరకు సామ్‌కే ఆ పాత్ర లభించింది. చిత్రీకరణలో పాల్గొని ఆమె నటిస్తున్నప్పుడు నన్ను కొట్టినట్లు అనిపించేంది. ఇలాంటి నటినా.. నేను వద్దనుకుంది’ అని ఫీల్ అయ్యానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇదే విషయాన్ని తాజాగా ‘సామ్ జామ్’ షోలో చెప్పుకొచ్చింది సమంత. ‘రంగస్థలం’ చిత్రంలో రామలక్ష్మి పాత్రకు మొదట నన్ను అనుకున్నప్పుడు.. అసిస్టెంట్ డైరెక్టర్లు వద్దని చెప్పారట. సమంత గ్లామరస్ హీరోయిన్. పల్లెటూరి అమ్మాయిగా ఆమెను ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు. రామలక్ష్మి పాత్రకు సమంత సరిపోదు’ అని డైరెక్టర్ సకుమార్‌కు చెప్పారట. అయితే సుకుమార్ రామలక్ష్మి పాత్ర గురించి చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇక సినిమా విడుదల తర్వాత వచ్చిన స్పందన గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని సమంత పేర్కొంది.By December 25, 2020 at 08:44PM
No comments