Breaking News

ఓటేయకపోవడం నేరం.. ప్రశ్నించే హక్కు వదులుకోవద్దు: రాజేంద్రప్రసాద్


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సినీనటుడు . కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఓటు వేయకపోవడం పెద్ద నేరమని అన్నారు. తమ భవిష్యత్తునే నిర్దేశించే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నా, మనకు కావాల్సింది అడిగి నెరవేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తాను అరకులో షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేసేందుకే హైదరాబాద్‌కు వచ్చానన్నారు. పోలింగ్ కేంద్రం బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని, నగర ప్రజలు తప్పనిసరిగా తమ ఓటుహక్కు వినియోగించుకుని నగర అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Also Read:


By December 01, 2020 at 10:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-rajendra-prasad-comments-on-ghmc-elections/articleshow/79504322.cms

No comments