అంతా కలిసి టార్గెట్ చేశారు.. ఆ టార్చర్ వల్ల చాలా తెలుసుకున్నా.. ఆలియా భట్ ఆవేదన
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) అంశం చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బంధుప్రీతి కారణంగా స్టార్ వారసులకు తప్ప టాలెంట్ ఉన్న నటీనటులకు అవకాశాలు దక్కడం లేదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి, ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్ కూతురు ఆలియా భట్‌ని టార్గెట్ చేశారట నెటిజన్లు. ఈ విషయాన్ని స్వయంగా చెబుతూ ఆవేదన చెందారు ఆలియా. తనను ఉద్దేశించి విద్వేషపూరిత పోస్టులు పెడుతూ టార్చర్ పెడుతున్నారని, అంతా కలిసి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు . సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నెటిజన్స్.. తనను కూడా వదలలేదని అన్నారు. తనకు హాని తలపెడతామని బెదిరిస్తూ కొందరు హద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ''కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నేను చాలా విద్వేషాన్ని ఎదుర్కొంటున్నా. చాలామంది నెటిజన్లు నన్ను ద్వేషిస్తున్నారు. తిడుతూ పోస్టులు వస్తుంటాయి. అయితే అవే నాకు ప్రేరణగా నిలుస్తున్నాయి. వీటన్నింటి కారణంగా ఎదుటి వ్యక్తితో దయతో వ్యవహరించాలని నాకు బాగా అర్థమైంది. ఇతరులతో పాటు ఈ భూమి పట్ల ప్రేమగా ఉండాలనే విషయం నాకు తెలిసింది'' అని చెప్పారు ఆలియా. Also Read: 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్.. ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేస్తూ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే 'సడక్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ RRRలో నటిస్తున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పాటు బ్రహ్మాస్త్ర మూవీలో భాగమవుతోంది ఆలియా భట్.
By December 03, 2020 at 03:52PM
No comments