Breaking News

నిర్మాత బన్నీవాసు ఇంట్లో విషాదం.. కిడ్నీ వ్యాధితో సోదరుడి మృతి


ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వాసు సోదరుడు గవర సురేష్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన రెండు కిడ్నీ సంబంధిత వ్యాధితో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన్ని కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్ ఇంజినీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాలను సీఎన్‌జీ(కంప్రెషర్ నేచురల్ గ్యాస్)లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి ఉత్తమ వ్యాపారవేత్తగా ఎదిగారు. మరోవైపు బన్నీవాసు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా రాణిస్తున్నారు. సురేష్ అకాల మరణం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.


By December 12, 2020 at 10:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-producer-bunny-vasu-brother-died-due-to-kidney-failure/articleshow/79690609.cms

No comments