చావు కబురు చల్లగా.. చెప్పనేలేదు మల్లీ అంటూ లావణ్యపై యంగ్ హీరో అలక! మ్యాటర్‌లో కిక్కుందిలే..
నేడు (డిసెంబర్ 15) అందాల రాక్షసి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో లావణ్య పుట్టిన రోజు కానుకగా ఆమె స్పెషల్ లుక్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది '' చిత్రయూనిట్. ఈ చిత్రంలో యంగ్ హీరో హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన 'మల్లిక' పాత్రలో లావణ్య త్రిపాఠి నటిస్తోంది. అయితే 'చావు కబురు చల్లగా' చిత్రయూనిట్ వదిలిన లేటెస్ట్ పోస్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన కార్తికేయ.. లావణ్యపై అలకపాన్పు వేస్తూనే కాస్త స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ''మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా..! చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని పట్టుకొస్తా.. అల్లాడించేద్దాం అంతే'' అంటూ కామెంట్ వదిలారు. అంటే.. సాయంత్రం పార్టీ గ్రాండ్‌గా చేసుకొని చిల్ అవుదాం అన్నట్లుగా కార్తికేయ చెప్పిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక 'చావు కబురు చల్లగా' సినిమా విషయానికొస్తే.. యువదర్శకుడు కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ 'బస్తీ బాలరాజు' పాత్రలో నటిస్తున్నాడు. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కార్తికేయ ఊరమాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. గళ్ళ చొక్కా వేసి, శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ కనిపించడంతో ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అతిత్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
By December 15, 2020 at 01:54PM
No comments